ఆ ఇమేజ్‌ నుంచి రాశీ ఖన్నా బయటపడుతుందా.. ? | Actress Rashi Khanna Talks About Upcoming Movies Plans | Sakshi
Sakshi News home page

ఆ ఇమేజ్‌ నుంచి రాశీ ఖన్నా బయటపడుతుందా.. ?

Published Tue, Jun 18 2024 12:00 PM | Last Updated on Tue, Jun 18 2024 3:36 PM

Raashi Khanna Next Movie Plan

అందాలతో కనువిందు చేయడంలో అతి కొద్దిమంది హీరోయిన్లలో నటి రాశీఖన్నా ఒకరని చెప్పవచ్చు. తొలుత మెడ్రాస్‌ కఫే అనే హిందీ చిత్రంతో నట జీవితాన్ని ప్రారంభించిన బ్యూటీ ఆ తరువాత టాలీవుడ్‌, కోలీవుడ్‌ అంటూ తన పరిధిని విస్తరించుకుంటూ వచ్చింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఇమైకా నొడిగళ్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి మెప్పించింది. ఆ తరువాత అడంగా మరు, దుల్కర్‌ దర్బార్‌, తిరుచిట్రంఫలం, సర్దార్‌ మొదలగు చిత్రాల్లో నటించి తనకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. 

ఇటీవల సుందర్‌.సీ దర్శకత్వంలో తమన్నతో పోటీ పడి (అందాలారబోతలో) నటించిన అరణ్మణై 4 (బాకూ) చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రం హిందీలోనూ అనువాదమై విడుదల కావడం విశేషం. అయితే సాధారణంగా గ్లామర్‌ పాత్రల్లో నటిస్తే క్రేజ్‌ వస్తుందని అంటుంటారు. అయితే రాశీఖన్నా ఆలోచనలు ఇప్పుడు అందుకు భిన్నంగా ఉన్నట్లు సమాచారం. గ్లామరస్‌గా నటించి బోర్‌ కొట్టిందో ఏమోగానీ, అందాలారబోతను మాత్రమే నమ్ముకుంటే సినిమాలో ఉన్నత స్థాయికి చేరుకోవడం కష్టమని, అభిమానుల మనసుల్లో పది కాలాల పాటు నిలిచిపోవడానికి, అవకాశాలు పెరగడానికి వైవిద్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటించడం ముఖ్యం అని ఈ అమ్ముడు ఇటీవల ఒక భేటీలో పేర్కొంది.

సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తున్న రాశీఖన్నాకు నటనకు అవకాశం ఉన్న పాత్రలు ఇప్పటికిప్పుడు రావడం అంటే ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్లామరస్‌ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న ఈమె ఆ ఇమేజ్‌ నుంచి బయట పడడానికి గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుందంటున్నాయి సినీ వర్గాలు. ఎందుకంటే రాశీఖన్నా ఇటీవల చీర ధరించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. అందులో ఆమె కట్టింది చీరే అయినా, మోడరన్‌ దుస్తులకు మించిన సొగసులు తొంగి చూస్తున్నాయనే కామెంట్స్‌ వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement