సందేశంతో ప్రశ్న | QuestionMark first look launch by Talasani Srinivas Yadav | Sakshi
Sakshi News home page

సందేశంతో ప్రశ్న

Sep 19 2020 2:51 AM | Updated on Sep 19 2020 2:51 AM

QuestionMark first look launch by Talasani Srinivas Yadav - Sakshi

అదా శర్మ

‘‘కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రేక్షకులకు వినోదం కరువైంది. ఇలాంటి తరుణంలో ఒక మంచి సందేశంతో వస్తోన్న ‘క్వచ్చన్‌ మార్క్‌’ చిత్రం విజయం సాధించి దర్శక–నిర్మాతలకు, హీరోయిన్, ఇతర యూనిట్‌ సభ్యులకు మంచి పేరు తీసుకురావాలి’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. అదా శర్మ లీడ్‌ రోల్‌లో విప్రా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్వశ్చన్‌ మార్క్‌’ (?). గౌరు ఘనా సమర్పణలో శ్రీ కృష్ణ క్రియేష¯Œ ్స పతాకంపై గౌరీ కృష్ణ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని తలసాని శ్రీనివాస్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా గౌరీకృష్ణ మాట్లాడుతూ– ‘‘కరోనా టైమ్‌లో చిత్రీకరణ ప్రారంభించి పూర్తి చేశాం. త్వరలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘క్వశ్చన్‌ మార్క్‌ టైటిల్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం చూస్తే ఈ టైటిల్‌ కరెక్ట్‌ అని అంటారు’’ అన్నారు విప్రా. ‘‘మా సినిమా చాలా బాగా వచ్చింది. నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెబుతున్నాను. విప్రా పేరుతో ప్రతిభావంతులైన ఇద్దరు దర్శకులు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అన్నారు అదా శర్మ. ఈ చిత్రానికి కెమెరా: వంశీ ప్రకాష్, సంగీతం: రఘు కుంచె.

Advertisement
 
Advertisement
Advertisement