Allu Arjun's Pushpa 2: High Expectations On Devi Sri Prasad Songs - Sakshi
Sakshi News home page

Allu Arjun's Pushpa 2 Songs: దేవిశ్రీపైనే ఎక్కువ ప్రెజర్‌.. ఈ సారి ఏం చేస్తాడో?

Aug 4 2022 5:29 PM | Updated on Aug 4 2022 6:13 PM

Pushpa2: High Expectations On Devi Sri Prasad Songs - Sakshi

అల్లు అర్జున్‌ నటించిన పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’ విజయంలో దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు కీలక పాత్ర పోషించాయి. పాన్ ఇండియా మార్కెట్ లో పుష్ప ను గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ చేసేందుకు సినిమాకు సూపర్ ఓపెనింగ్స్ ను అందించేందుకు చాలా హెల్ప్ అయ్యాయి. దేశాన్ని మొత్తాన్ని రాక్ స్టార్ బీట్స్ , బన్ని స్టెప్స్ ఊపేశాయి. ఇప్పుడు పుష్ప-2పై పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

(చదవండి: సీతారామం’ఫస్ట్‌ రివ్యూ: థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌కు సరైన మూవీ!)

దీంతో సుకుమార్‌ మరింత జాగ్రత్తగా స్క్రిప్ట్‌ రెడీ చేసుకుంటున్నాడు. సెప్టెంబర్ నుంచి పుష్ప పార్ట్ 2 సెట్స్ పైకి వెళ్తోంది. అయితే సుకుమార్ కంటే కూడా సీక్వెల్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్‌ పైనే ఎక్కువ ప్రెజర్ ఉంది. ఈ సారి రాక్ స్టార్ ఎలాంటి ట్యూన్స్ అందిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అందుకు తగ్గట్లే రాక్ స్టార్ అదిరిపోయే ట్యూన్స్ కంపోజ్ చేశాడట. మరోసారి దేవి ట్రాక్స్ సెన్సేషన్ సృష్టించడం ఖాయం అంటోంది చిత్ర యూనిట్‌. కానీ పుష్ప  తర్వాత వచ్చిన సినిమాలకు దేవి అందించిన పాటలేవి అంతగా ఆకట్టుకోలేదు.

గుడ్ లక్ సఖి, ఖిలాడి, ఆడవాళ్లు మీకు జోహార్లు, లాంటి చిత్రాలకు రాక్ స్టార్ కంపోజ్ చేసిన సాంగ్స్ సినిమాకు హెల్ప్ కాలేదు. ఎఫ్ 3, ది వారియర్ మూవీస్ కు మాత్రం దేవి ఇచ్చిన పాటలు కొంత ఇంప్రెస్ చేశాయి. ఈ దశలో పుష్ప 2కు దేవి అంచనాలు మించి ట్యూన్స్ అందించగలడా అంటే రాక్ స్టార్ ఎక్స్ పీరియెన్స్ ను తక్కువ అంచనా వేయద్దు అంటున్నారు అతని ఫ్యాన్స్. ఈ సారి ఊ ఆంటావా , శ్రీవల్లి,  సామిసామి మించిన ట్యూన్స్ తో తిరిగొస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement