హను–మాన్‌ మాకు ఓ వరం: నిర్మాత చైతన్య | Producer Chaitanya Reddy About Priyadarshi Darling movie | Sakshi
Sakshi News home page

హను–మాన్‌ మాకు ఓ వరం: నిర్మాత చైతన్య

Jul 7 2024 3:49 AM | Updated on Jul 7 2024 3:49 AM

Producer Chaitanya Reddy About Priyadarshi Darling movie

‘‘మా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలో నిర్మించే సినిమాలకు కథే హీరో. ‘డార్లింగ్‌’ సినిమాకూ అంతే. ఈ చిత్రంలో ప్రియదర్శి, నభా నటేశ్‌ అద్భుతంగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పక కనెక్ట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత చైతన్య. ప్రియదర్శి, నభా నటేశ్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘డార్లింగ్‌’. అశ్విన్‌ రామ్‌ దర్శకత్వంలో కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో చెతన్య మాట్లాడుతూ– ‘‘డార్లింగ్‌ కథను నిరంజన్‌రెడ్డిగారే ఓకే చేశారు. మాది ప్రేమ వివాహం. దర్శకుడు రామ్‌ అశ్విన్‌ది కూడా ప్రేమ వివాహం. సో.. ప్రేమ నేపథ్యంలో రామ్‌ చెప్పిన ‘డార్లింగ్‌’ సినిమా పాయింట్‌కు నిరంజన్‌ కనెక్ట్‌ అయ్యారు. సింపుల్‌గా ఉండే అబ్బాయి పాత్రలో ప్రియదర్శి, కొంచెం హైపర్‌ యాక్టివ్‌గా ఉంటూ స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి పాత్రలో నభా కనిపిస్తారు.

ఇక ‘హను–మాన్‌’ సినిమా మాకు ఓ వరంలా లభించింది. సంక్రాంతి సమయంలో విడుదల కావడం, అంత పెద్ద హిట్‌ కావడం అనేది ఆ హనుమంతుడి దయ వల్లే జరిగిందని భావిస్తున్నాం. ‘హను–మాన్‌’ సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’ ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. నావరకైతే ‘జై హనుమాన్‌’లో చిరంజీవి, రామ్‌చరణ్‌గార్లు అయితే బాగుంటుందని అనుకుంటున్నా. సాయితేజ్‌గారితో ఓ సినిమా ప్రకటించాం. ఇంకో పది సినిమాలుప్రోడక్షన్‌లో ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో మా బేనర్‌ నుంచి పది సినిమాలు రిలీజ్‌ అవుతాయి’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘రెండు మాస్టర్స్‌ డిగ్రీలు చేశాను. టెక్నికల్‌ సపోర్ట్‌ ఉంది. సో.. బిజినెస్‌ను నేను బాగా హ్యాండిల్‌ చేయగలుగుతున్నాను. ఇందుకు మా ఫ్యామిలీ సపోర్ట్‌ కూడా ఉంది’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement