వారియర్‌ అయ్యారు సింగర్‌

Priya Prakash Varrier Hindi music video Teaser Release - Sakshi

కన్ను గీటి ఆన్‌లైన్‌లో బాగా పాపులర్‌ అయ్యారు మలయాళ నటి ప్రియా ప్రకాష్‌ వారియర్‌. మలయాళ చిత్రం ‘ఒరు అడార్‌ లవ్‌’లో కన్ను కొట్టే సన్నివేశం ప్రియా ప్రకాష్‌ను దేశవ్యాప్తంగా పాపులర్‌ చేసింది. తాజాగా ప్రియా వారియర్‌ సింగర్‌గా మారారు.

ఓ హిందీ మ్యూజిక్‌ వీడియోలో నటించి, ఆ పాటను ఆలపించారామె. అశోకన్‌ పి. దర్శకత్వం వహించిన ఈ మ్యూజిక్‌ వీడియో త్వరలోనే విడుదల కానుంది. ఈ పాట టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. క్రిస్టస్‌ స్టీఫెన్‌ సంగీతం అందించారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే ఈ మ్యూజిక్‌ వీడియోను షూట్‌ చేశామని టీమ్‌ పేర్కొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top