సీరియల్‌ నుంచి సినిమాల్లోకి.. ఇప్పటికీ అలాగే! | Priya Bhavani Shankar Focus On Glamour, Photos Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Priya Bhavani Shankar: భీమా హీరోయిన్‌.. నేచురల్‌ బ్యూటీ!

Mar 24 2024 11:54 AM | Updated on Mar 24 2024 2:02 PM

Priya Bhavani Shankar Focus On Glamour - Sakshi

బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయిన కథానాయికల్లో ప్రియ భవానీశంకర్‌ ఒకరు. 2017లో మేయాదమాన్‌ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం విజయం సాధించడంతో ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. ఆ తరువాత నటించిన కడైకుట్టి సింగం, మాన్‌స్టర్‌ వంటి చిత్రాల సక్సెస్‌ ఈ అమ్మడిని స్టార్‌ హీరోయిన్‌ చేశాయి. ఇకపోతే తమిళంతో పాటు తెలుగులోనూ అవకాశాలు రావడంతో ప్రియాభవానీ శంకర్‌ బహుభాషా నటిగా రాణిస్తున్నారు.

ఇటీవల ఈమె గోపీచంద్‌ సరసన నటించిన తెలుగు చిత్రం భీమా విడుదలై మంచి వసూళ్లనే సాధించింది. ప్రస్తుతం ఆమె చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. నటనతో పాటు రెస్టారెంట్‌ బిజినెస్‌తో బాగానే సంపాదిస్తున్నారు. ఎక్కువగా పద్ధతిగానే కనిపించే ప్రియ చాలామటుకు ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటుంది. తన షేర్‌ చేసే ఫోటోల్లో కూడా ఎక్కడా అతి అనిపించదు. అందుకే చాలామంది ఆమెను ఆరాధిస్తున్నారు. నేచురల్‌ బ్యూటీ అని పొగిడేస్తున్నారు.

ఇకపోతే ఈమె నటించిన డీమాంటీ కాలనీ– 2 చిత్రం విడుదల కావాల్సి ఉండగా విశాల్‌ సరసన నటించిన రత్నం చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది. వీటితో పాటు శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్‌– 2 చిత్రంలోనూ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.

చదవండి: దేశంలో నాలాగే ఒంటరిగా చాలామంది ఉన్నారు.. తప్పుగా రాయకండి: మీనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement