హనుమాన్‌ నా బాధ్యత పెంచింది | Sakshi
Sakshi News home page

హనుమాన్‌ నా బాధ్యత పెంచింది

Published Sun, Jan 28 2024 1:02 AM

Prashanth Varma: HanuMan Gratitude Meet - Sakshi

‘‘హనుమాన్‌’ సినిమా విజయానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ అందరి రుణం ‘జై హనుమాన్‌’ సినిమాతో తీర్చుకోబోతున్నాను. ‘హనుమాన్‌’కి వంద రెట్లు ఎక్కువగా ‘జై హనుమాన్‌’ ఉంటుంది’’ అని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్‌ జంటగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘హనుమాన్‌’. ప్రశాంత్‌ వర్మ దర్శకుడు. చైతన్య సమర్పణలో కె. నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలైంది.

శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ–‘‘హనుమాన్‌’కి వచ్చిన స్పందన చూసిన తర్వాత నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది నాపై ఇంకా బాధ్యత పెంచింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కి వచ్చే చిత్రాలను బాధ్యతగా తీస్తాను’’ అన్నారు. ‘‘మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు పాదాభివందనం’’ అన్నారు తేజ. ‘‘హనుమాన్‌’ని హిట్‌ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు నిరంజన్‌ రెడ్డి.

Advertisement
 
Advertisement