సంక్రాంతికి జాతర | Prajwal Devaraj, is set to star in a Pan India film | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి జాతర

Jun 19 2023 4:11 AM | Updated on Jun 19 2023 4:11 AM

Prajwal Devaraj, is set to star in a Pan India film - Sakshi

కన్నడ నటుడు దేవరాజ్‌ పెద్ద కుమారుడు ప్రజ్వల్‌ దేవరాజ్‌ హీరోగా నటించనున్న చిత్రం ‘జాతర’. ఉదయ్‌ నందనవనమ్‌ దర్శకత్వంలో వర్ధమాన్, లోటస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై గోవర్ధన్‌ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్‌ ఆగస్టులో ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా
గోవర్ధన్  రెడ్డి మాట్లాడుతూ–‘‘జాతర’కి మంచి కథ కుదిరింది.

ప్రజ్వల్‌కి స్క్రిప్ట్‌ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు. బి. వాసుదేవ్‌ రెడ్డి కథకు ఉదయ్‌ నందన వనమ్‌ ఇచ్చిన ట్రీట్మెంట్, స్క్రీన్  ప్లే ‘జాతర’ స్క్రిప్ట్‌ను మరింత కొత్తగా మార్చాయి. హైదరాబాద్, బళ్లారి లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ప్రేమ కథ ఎంత అందంగా ఉంటుందో, నేపథ్యం కూడా అంతే కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు ఉదయ్‌ నందనవనమ్‌. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందనున్న ఈ మూవీకి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement