నాకు మళ్లీ కరోనా:ప్ర‌గ్యా జైస్వాల్‌ | Pragya Jaiswal Said She Tested Covid 19 Positive Again | Sakshi
Sakshi News home page

Pragya Jaiswal: నాకు కరోనా వచ్చింది: ప్ర‌గ్యా జైస్వాల్‌

Oct 10 2021 3:58 PM | Updated on Oct 10 2021 5:15 PM

Pragya Jaiswal Said She Tested Covid 19 Positive Again  - Sakshi

హీరోయిన్‌ ప్ర‌గ్యా జైస్వాల్‌ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తను పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. ‘ఆదివారం నేను కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాను. నాకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నాను. ఇంత‌క‌ముందు క‌రోనా బారిన ప‌డ్డాను. ఇప్పడు మ‌ళ్లీ క‌రోనా వ‌చ్చింది .ప్ర‌స్తుతం నేను ఐసోలేషన్లో ఉన్నాను. గత 10 రోజులుగా నన్ను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి’ అని ప్రగ్యా సూచించింది. 

అయితే ప్ర‌గ్యాకి క‌రోనా సోక‌డంతో అఖండ మూవీ టీం ఆందోళనలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆఖండ మూవీ షూటింగ్‌ పూర్తి కావడంతో చిత్ర బృందం సెలబ్రెషన్స్‌ చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె హీరో బాలకృష్ణతో పాటు పలువురితో సన్నిహితంగా మెలిగింది. అంతేగాక బాలకృష్ణతో కలిసి దిగిన ఫొటోను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన  సంగతి తెలిసిందే. ​

Advertisement
 
Advertisement
Advertisement