ప్రభు కూతురు పెళ్లి.. కట్నంగా ఎంత ఇచ్చారంటే | Sakshi
Sakshi News home page

ప్రభు కూతురు పెళ్లి.. కట్నంగా ఎంత ఇచ్చారు.. వారిద్దరి వయసు సంగతేంటి?

Published Sun, Dec 17 2023 12:37 PM

Prabhu Gift To His Daughter Wedding Time - Sakshi

సౌత్‌ ఇండియాలో స్టార్‌ నటుడిగా ప్రభుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తాజాగా ఆయన కూతురు ఐశ్వర్య వివాహం జరిగిన విషయం తెలిసిందే. కోలీవుడ్‌ యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో ఆమె వివాహం జరిగింది. ఆమెకు గతంలోనే పెళ్లి కావడం ఆపై భర్త నుంచి విడాకులు తీసుకుంది. సుమారు కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు అధిక్‌ రవిచంద్రన్‌ను రెండో పెళ్లి చేసుకుంది. 2015లో త్రిష ఇల్లానా నయనతార సినిమాతో తమిళ సినిమాకి దర్శకుడిగా పరిచయం అయిన అధిక్‌ రవిచంద్రన్‌.. రీసెంట్‌గా మార్క్ ఆంటోని చిత్రంతో సూపర్‌ హిట్‌ కొట్టాడు. విశాల్‌, ఎస్‌జే సూర్య నటించిన ఈ సినిమా రూ. 100 కోట్లు రాబట్టింది.

వివాహం
కోలీవుడ్‌ టాప్‌ హీరో అజిత్‌ సినిమాకు  అధిక్ రవిచంద్రన్  దర్శకత్వం వహిస్తున్న సమయంలో నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. చెన్నైలో జరిగిన ఈ వివాహానికి నటుడు విశాల్, దర్శకుడు మణిరత్నం, సుహాసిని, దుల్కర్‌ సల్మాన్, లెజెండ్ శరవణన్, సుందర్.సి, ఖుష్బూ హాజరయ్యారు. వీరి పెళ్లి ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి.

విడాకులు
నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్యకు గతంలోనే వివాహం అయింది. ప్రభు సోదరి తేన్‌మొళి కుమారుడు కునాల్‌తో ఆమెకు వివాహం జరిగింది. కునాల్ లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, కూతురు ఐశ్వర్య కూడా లండన్‌లో స్థిరపడింది. అయితే హఠాత్తుగా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడాకులు తీసుకుని చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు.

దర్శకుడితో ప్రేమ
విడాకుల తర్వాత చెన్నైకి తిరిగి వచ్చిన ప్రభు కూతురు ఐశ్వర్య కేక్‌లు తయారు చేసి విక్రయించే వ్యాపారం చేస్తోంది. ఆమె మెల్ట్జ్ డెసర్ట్స్ (meltz.dessertz) అనే కంపెనీని నడుపుతుంది. ఈ సమయంలో, ఐశ్వర్య, దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్‌ల స్నేహం ప్రేమగా మారడం. ఆపై ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం జరిగింది.

కోట్లాది రూపాయల కట్నం
వివాహంతో శివాజీ గణేశన్ (ప్రభు తండ్రి) కుటుంబానికి చెందిన దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్‌కు నగలు, చెన్నైలో విలాసవంతమైన బంగ్లాతో పాటు నగదు రూపంలో కోటి రూపాయలు కట్నం ఇచ్చినట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఐశ్వర్య వయసు 34 ఏళ్లు కాగా, దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ వయసు ఇప్పుడు 32 ఏళ్లు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement