సంక్రాంతికి సర్‌ప్రైజ్

Prabhas Will Be Giving Surprise To Fans For Sankranti - Sakshi

హీరో ప్రభాస్‌ సంక్రాంతి పండక్కి అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారట. రెండు సినిమాల అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేయనున్నారని టాక్‌. ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. పూజా హెగ్డే కథానాయిక. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమా విడుదల తేదీని సంక్రాంతికి ప్రకటిస్తారని సమాచారం.

అదేవిధంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు ప్రభాస్‌. ఇది సైన్స్‌ ఫిక్షన్‌ తరహా చిత్రం. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ కూడా ఉంటుందని కన్‌ఫర్మ్‌ చేశారు నాగ్‌ అశ్విన్‌. ఇంతకీ ఆ సర్‌ప్రైజ్‌లేంటో తెలియాలంటే సంక్రాంతి వరకూ వేచిచూడాల్సిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top