అభిమానికి వీడియో కాల్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసిన ప్రభాస్‌ | Prabhas Special Video Call To His Fan Suffering With Cancer | Sakshi
Sakshi News home page

Prabhas: అభిమానికి వీడియో కాల్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసిన ప్రభాస్‌

Sep 19 2021 10:52 AM | Updated on Sep 19 2021 1:44 PM

Prabhas Special Video Call To His Fan Suffering With Cancer - Sakshi

అభిమాని లేనిదే హీరోలు లేరు అనేది అందరికి తెలిసినా.. ఆ మాటలకు విలువ ఇచ్చే వారు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు.

అభిమాని లేనిదే హీరోలు లేరు అనేది అందరికి తెలిసినా.. ఆ మాటలకు విలువ ఇచ్చే వారు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. అభిమానులకు తిరిగి ప్రేమను పంచడం కొందరు గొప్ప గౌరవంగా భావిస్తారు. అలాంటి వారిలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఒకరు. ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటీకీ.. అభిమానులతో మాత్రం ఎప్పుడూ టచ్‌లోనే ఉంటారు. ఇక రీసెంట్‌గా క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమానికి వీడియో కాల్‌లో మాట్లాడి ఆమె ముఖంపై నవ్వులు కురిపించాడు.
(చదవండి: థియేటర్లను పూర్తిగా మూసేయ్యాలి అనుకుంటున్నారా..?)

శోభిత అనే అమ్మాయి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు ప్రభాస్‌ అంటే ఇష్టమని తెలుసుకున్న డాక్టర్లు.. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, అతని పట్ల ఆమెకున్న అభిమానాన్ని తెలుసుకున్న ప్రభాస్ తన బిజీ షెడ్యూల్‌లో ఆమెకు కొంత సమయం కేటాయించి వీడియో కాల్‌లో మాట్లాడి ఆమెకు అనందాన్ని పంచారు. గతంలో కూడా భీమవరంలో మృత్యువుకు దగ్గరవుతున్న తన 20 ఏళ్ల అభిమానితో ఇలానే మాట్లాడి సర్‌ప్రైజ్‌ చేశాడు ఈ పాన్‌ ఇండియా స్టార్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement