Prabhas 'Salaar' Movie Coming In Two Parts, Reveals On Ugadhi - Sakshi
Sakshi News home page

సలార్ సీక్వెల్ ఉంటుందా?.. అయోమయంలో ప్రభాస్ ఫ్యాన్స్!

Published Sat, Mar 18 2023 2:45 PM | Last Updated on Sat, Mar 18 2023 3:11 PM

Prabhas Salaar Movie Coming into Parts Reveals On Ugadhi - Sakshi

బాహుబలి-2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్‌  బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.  దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కానీ ప్రభాస్ మూవీ లైనప్ చూసి హ్యాపీ అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో  ఉన్న సినిమాలు మరే పాన్ ఇండియా స్టార్ దగ్గర లేవు. సెట్స్ మీద నాలుగు సినిమాలు ఉంటే.. మరో రెండు సినిమాలు లైన్‌లో వున్నాయి. అయితే ఓ విషయంలో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. అయితే ఈ కన్ప్యూజన్‌కు బ్రేక్ వేసేందుకు ప్రభాస్‌తో పాటు సలార్ టీమ్ సిద్ధమైంది. 

రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ ఒకేసారి నాలుగు సినిమాలు లైన్‌లో పెట్టాడు. బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్న ఆదిపురుష్‌ జూన్ 16 విడుదల కానుంది. ఈ మూవీ హాండ్రెడ్ డేస్ కౌంట్‌ డౌన్ కూడా స్టార్ట్ అయింది. ఇక సినిమా తర్వాత సెప్టెంబర్ 28న సలార్ విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా విషయంలోనే  ఫ్యాన్స్ కొంచెం అయోమయంగా వున్నారు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా సలార్. దీంతో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ  సినిమాపై హైప్ క్రియేట్ అయింది. 

(ఇది చదవండి: రమ్యకృష్ణను అలా చూసి ఏడ్చేశా.. రోజంతా నిద్రపట్టలేదు: కృష్ణ వంశీ)

సలార్ సినిమాను కూడా కేజీఎఫ్‌ నిర్మాతలే నిర్మిస్తుండగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటప్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాపై ప్రభాస్ కూడా సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట. అయితే సలార్ సింగిల్ మూవీనా... టూ పార్ట్స్‌గా  వస్తుందా అనే  దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే నెటిజన్స్ మాత్రం సలార్ మూవీ టూ పార్ట్స్‌గా వస్తుందని గట్టిగా చెబుతున్నారు. 

ఈ సినిమాలో ప్రభాస్ డబుల్ రోల్‌లో కనిపిస్తాడట. గతంలో ప్రభాస్ బాహుబలి సినిమాలో కూడా తండ్రి, కుమారుడిగా నటించాడు. కానీ ఏ సీన్‌లోనూ కలిసి కనిపించరు. కానీ సలార్ సినిమాలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయంలో ప్రభాస్ కలిసి కనిపిస్తారనే మాట వినిపిస్తోంది. సలార్ ఫస్ట్ పార్ట్‌లో ప్రభాస్ సలార్‌గా కనిపించగా.. ఇక సలార్ సెకండ్ పార్ట్‌లో ప్రభాస్ దేవాగా కనిపిస్తాడట. అయితే సలార్ టీమ్ మాత్రం దేవ క్యారెక్టర్ రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. సలార్ ఫస్ట్ పార్ట్ ఎండింగ్‌లో దేవా క్యారెక్టర్‌ను పరిచయం చేస్తారనే మాట టాలీవుడ్‌లో వినిపిస్తోంది. 

దేవా పాత్ర సలార్ వన్ లాస్ట్‌లో రివీల్ చేస్తే.. పార్ట్ -2 పై అంచనాలు పెరుగుతాయనేది మేకర్స్ ప్లాన్. అయితే సలార్ వన్, టూ షూటింగ్ ఒకేసారి కంప్లీట్ చేస్తారా.. సలార్ రిలీజ్ తర్వాత పార్ట్ -2 షూటింగ్ స్టార్ట్ చేస్తారా అనేది తెలియాల్సి వుంది.  సలార్ మూవీ రెండు పార్టులా లేక సింగిల్ మూవీగా  వస్తుందా అనే విషయం ఉగాది రోజు సలార్ టీమ్ అప్డేట్‌తో క్లారిటీ కానుంది. ఉగాది రోజు సలార్ టీజర్ రిలీజ్  చేసేందుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాటు మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

(ఇది చదవండి: మా నాన్న వల్లే వచ్చా.. ఢిల్లీ ఈవెంట్‌లో నెపోటిజంపై చరణ్‌ కామెంట్స్‌)

ఇక ఈ టీజర్‌లో సలార్ పార్ట్ వన్  అని ఎనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. సలార్ మూవీ ఎన్ని పార్ట్స్ ఉంటుందన్న విషయం పక్కన పెడితే.. కన్ప్యూజన్ కి ఎండ్ కార్డ్ పడుతోంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కూడా ఈ ఎండ్ కార్డ్ కోసమే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె, మారుతి డైరెక్షన్‌లో రాజా డీలక్స్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ సందీప్ వంగాతో స్పిరిట్ మూవీ... బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్‌తో ఓ యాక్షన్ మూవీ లైన్‌లో పెట్టాడు. ఇలా వరుస సినిమాలతో ఫ్యాన్స్‌కు మాత్రం  ఫుల్ ట్రీట్ అందించాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడనే చెప్పాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement