రాధేశ్యామ్‌ ట్రైలర్‌ రిలీజ్‌కు డేట్‌ ఫిక్స్‌ | Prabhas Radhe Shyam Trailer Release On March 2nd | Sakshi
Sakshi News home page

Radhe Shyam: రాధేశ్యామ్‌ ట్రైలర్‌ రిలీజ్‌కు డేట్‌ ఫిక్స్‌

Mar 1 2022 10:57 AM | Updated on Mar 1 2022 10:57 AM

Prabhas Radhe Shyam Trailer Release On March 2nd - Sakshi

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్‌'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 11న విడుదల కానుంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుంది. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా చిత్రంగా యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

చదవండి: ఆదిపురుష్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో మేకర్స్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలను స్టార్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్‌ ట్రైలర్‌ ఈవెంట్‌గా చిత్రం బృందం గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సినిమా నుంచి ట్రైలర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్‌ తల్లిగా బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ నటిస్తుండగా.. కృష్ణం రాజు, జగపతి బాబులు కీలక పాత్రలో కనిపంచనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement