జపాన్‌లో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రీ రిలీజ్ కూడా | Prabhas Birthday Celebrations In Japan, Fans Watch Radhe Shyam Re Release, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

Prabhas Birthday Celebrations Videos: జపాన్‌లోనూ డార్లింగ్ ప్రభాస్ క్రేజ్.. వేరే లెవల్

Oct 20 2024 9:11 AM | Updated on Oct 20 2024 10:59 AM

Prabhas Birthday Celebrations In Japan

పాన్ ఇండియా పుణ్యమా అని మన హీరోలకు ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ బోలెడంత మంది అభిమానులు ఉంటున్నారు. 'బాహుబలి'తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌కి మన దేశంతో పాటు జపాన్‌లోనూ లెక్కలేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లలో కొందరు ఇప్పుడు డార్లింగ్ ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.

(ఇదీ చదవండి: కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!)

అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు. ఆ రోజున రాజా సాబ్, కల్కి  2, సలార్ 2 సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్ రావొచ్చని టాక్. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలుచోట్ల 'సలార్' రీ రిలీజ్ చేశారు. మిస్టర్ ఫెర్‌ఫెక్ట్, ఈశ్వర్, రెబల్ చిత్రాల్ని కూడా రీ రిలీజ్ చేస్తారు.

ఇప్పుడు జపాన్‌లోనూ ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడంతో పాటు 'రాధేశ్యామ్' మూవీని రీ రిలీజ్ చేశారు. లేడీ ఫ్యాన్స్ చాలామంది ఈ సినిమాని చూసి ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఫొటోలు, వీడియోలు కొన్ని వైరల్ కావడంతో ఇక్కడి డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

(ఇదీ చదవండి: మరో స్టార్ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్ కేసు)

Advertisement
 
Advertisement
Advertisement