‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు | Sakshi
Sakshi News home page

‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు

Published Wed, Oct 26 2022 4:17 AM

Prabhas launches trailer for Like Share And Subscribe - Sakshi

సంతోష్‌ శోభన్,  ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. బ్రహ్మాజీ, సుదర్శన్‌ కీలక పాత్రలు చేశారు. వెంకట్‌ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ– ‘‘కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు.

‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు మేర్లపాక గాంధీ. ‘‘జాతిరత్నాలు’ తర్వాత అందరూ నన్ను చిట్టీ అని పిలుస్తున్నారు. ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ చూశాక నేను చేసిన వసుధ పాత్రే గుర్తుంటుంది’’ అన్నారు ఫరియా అబ్దుల్లా. ‘‘ఈ నెల 29న మా సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించనున్నాం’’ అన్నారు వెంకట్‌ బోయినపల్లి. నటులు బ్రహ్మాజీ, సుదర్శన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వెంకటరత్నం పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement