నవమికి రాముడు?

Prabhas first look from Adipurush gets released on Shri Ram Navmi - Sakshi

‘ఆదిపురుష్‌’ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాముడు పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతీ సనన్‌ , రావణుడి ప్రాతలో సైఫ్‌ అలీఖాన్‌  నటిస్తున్నారు. శ్రీరామ నవమి పండగ సందర్భంగా వచ్చే నెల ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రదర్శకుడు ఓం రౌత్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబయ్‌లో జరుగుతోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ ఏప్రిల్‌ రెండోవారం వరకు జరగుతుందని సమాచారం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top