రెండు కోట్ల ప్రేమ

‘బాహుబలి’ చిత్రం ప్రభాస్ పేరుని దేశవ్యాప్తంగా దాదాపు అందరికీ తెలిసేలా చేసింది. ప్రస్తుతం ఆయన ప్యాన్ ఇండియా స్టార్. సినిమా సినిమాతో కలెక్షన్లు బద్దలు కొడుతున్నారు. అలానే సోషల్ మీడియాలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రభాస్ ఫేస్‌బుక్ అకౌంట్‌ను దాదాపు 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అంటే రెండు కోట్ల మంది. ఫేస్‌బుక్‌లో ఇంతమంది ఫాలోయర్స్ ఉన్న సౌత్ హీరో ప్రభాసే కావడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేయనున్నారు. ఈ మూడూ ప్యాన్ ఇండియా సినిమాలే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి