రెండు సినిమాలు.. ప్రభాస్‌ రికార్డు! | Salaar: Prabhas To Become First Actor Who Give Two Rs100 Crores Collected Movies On Day 1 In Same Year 2023 - Sakshi
Sakshi News home page

Prabhas Day 1 Collections Record: 100 కోట్లు.. ప్రభాస్‌ రికార్డు!

Dec 23 2023 7:25 PM | Updated on Dec 23 2023 7:40 PM

Prabhas Created Unique Record With His Movies Collections Released In Same Year 2023 - Sakshi

ప్రభాస్‌ హీరోగా నటించిన సలార్‌ మూవీ ప్రస్తుతం ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తుంది. ప్రశాంత్‌ నీల్‌ మేకింగ్‌, ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమార్‌ యాక్టింగ్‌పై సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అయితే చాలా కాలం తర్వాత తమ హీరోని పూర్తి మాస్‌ లుక్‌లో చూశామంటూ మురిసిపోతున్నారు. ఎట్టకేలకు మా హీరో ఖాతాలో ఓ భారీ బ్లాక్‌ బస్టర్‌ పడిదంటూ సోషల్‌ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వెల్లడిస్తున్నారు. 

(చదవండి: ‘సలార్‌’ మూవీ రివ్యూ)

ఇక సలార్‌ రికార్డుల వేట మొదలైంది. తొలి రోజే రూ.177 కోట్లకు పైగా వసూళ్లను సాధించి..ఈ ఏడాదిలో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. అలాగే ఈ మూవీ ప్రభాస్‌ ఖాతాలో మరో రికార్డును కూడా చేర్చింది.  ఒక్క ఏడాదిలో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ రూ. 100 కోట్లను దాటించిన ఏకైక హీరోగా హీరో ప్రభాస్‌ నిలిచాడు.

ప్రభాస్‌ హీరోగా నటించిన ‘ఆదిపురుష్‌’ మూవీ కూడా ఈ ఏడాదిలోనే విడుదలై తొలిరోజు రూ. 140 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు సలార్‌ కూడా తొలి రోజు రూ.177 కోట్లను రాబట్టింది. ఇలా ఓకే ఏడాదిలో రెండు సినిమాలు విడుదలై..తొలిరోజు రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టడం ప్రభాస్‌కి మాత్రమే సాధ్యమైంది.  ఓవరాల్‌గా తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన భారతీయ చిత్రం మాత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ . ఆ మూవీ తొలి రోజు రూ. 240 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

సలార్‌ విషయానికొస్తే.. కేజీయఫ్‌ 2 లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. మళయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమార్‌ కీలక పాత్రలో నటించాడు. శృతిహాసన్‌ హీరోయిన్‌. డిసెంబర్‌ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement