
సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, ‘శుభలేఖ’ సుధాకర్, షాయాజీ షిండే, ‘శంకరాభరణం’ తులసి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘΄పోలీస్‌వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్, నటి ఇంద్రజ మాట్లాడుతూ– ‘‘మేమంతా ఇక్కడికి వచ్చామంటే కారణం బాబ్జీ మీద ఉన్న గౌరవం. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు.
‘‘ఈ చిత్రంలో అన్ని వాణిజ్య అంశాలు ఉన్నాయి’’ అన్నారు ‘శుభలేఖ’ సుధాకర్. ‘‘ఈ సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తుందనుకుంటున్నాను’’ అని దర్శకుడు సముద్ర నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘మా సినిమాని అందరూ చూసి మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు బెల్లి జనార్ధన్. బాబ్జీ మాట్లాడుతూ– ‘‘సినిమాల కోసం పని చేసేవారు తాము చేసిన చిత్రం విడుదలైన ప్రతిసారీ పుడుతూనే ఉంటారు. సినిమా కోసమే పుట్టామని భావిస్తారు. మా ‘పోలీస్ వారి హెచ్చరిక’ని ఆదరించాలి’’ అని పేర్కొన్నారు.