Police Case Filed on Pushpa Movie Pre-Release Event Organisers - Sakshi
Sakshi News home page

Pushpa Pre Release Event: పుష్ప ప్రీరిలీజ్‌పై ఈవెంట్‌ పోలీసులు సీరియస్‌

Dec 13 2021 1:58 PM | Updated on Dec 13 2021 3:16 PM

Police Case Filed On Pushpa Pre Release Event Managers And Shreyas Creations - Sakshi

Police Case Filed On Pushpa Pre Release Event: అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై మేనేజర్లకు పోలీసులు షాక్‌ ఇచ్చారు. నిన్న గ్రాండ్‌గా జరిగిన పుష్ప ప్రీరిలీజ్‌ ఈవెంట్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు మండిపడుతున్నారు. కేవలం 5000 పాస్‌లకు మాత్రమే అనుమతి తీసుకుని ఎక్కువ పాసులు జారీ చేశారని నిర్ధారించిన పోలీసులు శ్రేయాస్ క్రియేషన్స్‌ మీడియాతో పాటు ఈవెంట్ ఆర్గనైజేషన్‌పై కేసు నమోదు చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్ కిశోర్‌పై ఐపీసీ సెక్షన్ 143, 341, 336, 290 కింద కేసులు నమోదు చేశారు. 

చదవండి: కాజల్‌పై బిగ్‌బాస్‌ నిర్వాహకులు సీరియస్‌! ఆ రూల్‌ బ్రేక్‌ చేసిందా?

కాగా డిసెంబర్‌ 12వ తేదీ ఆదివారం సాయంత్రం యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం ఉదయం నుంచే…యూసుఫ్ గూడ ప్రాంతానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. వేల సంఖ్యలో ప్రజలు ఈ వేడుకకు పోటెత్తారు. దీంతో గ్రౌండ్స్‌ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. యూసుఫ్ గూడ రహదారులన్నీ బ్లాక్ అవ్వడంతో ట్రాఫీక్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.

చదవండి: ‘తగ్గేదే లే’ డైలాగ్‌తో తండ్రి మ్యానరిజం చూపించిన అయాన్‌, ఆర్హ

అభిమానులంతా ఉత్సాహాంతో అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటుకుని రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై ఈవెంట్ మేకర్స్ సీరియస్ అయ్యి ఫ్యాన్స్‌ అదుపుచేసే ప్రయత్నం చేశారట. కానీ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మాత్రం ‘తగ్గేదే లే’ అన్నట్లు వ్యవహరించారు. ఇది తెలిసి పోలీసులు ఈవెంట్‌కు ఎంతమంది వచ్చారనేది ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. 5 వేల పాస్‌లకే అనుమతి ఉండగా.. అంతకంటే ఎక్కువ పాస్‌లు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఈవెంట్‌ నిర్వహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement