రేణూ దేశాయ్‌పై అసభ్య కామెంట్స్‌.. నిందితుడి అరెస్ట్‌ | Police Arrested Man for Trolling Renu Desai | Sakshi
Sakshi News home page

రేణూ దేశాయ్‌పై అసభ్య కామెంట్స్‌.. నిందితుడి అరెస్ట్‌

Apr 9 2026 12:23 PM | Updated on Apr 9 2026 12:44 PM

Police Arrested Man for Trolling Renu Desai

సామాజిక మాధ్యమాలలో నటి రేణు దేశాయ్‌పై అసభ్యకర పోస్టు చేసిన నిందితుడిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. గుంటూరుకు చెందిన చెన్నయ్య ఖాళీ సమయంలో తరచుగా యూట్యూబ్‌లో రీల్స్‌ చూస్తుంటాడు. ఇటీవల నటి రేణు దేశాయ్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఒక రీల్‌ను చూశాడు. ఆ రీల్‌ చూసిన తర్వాత చెన్నయ్య తన యూట్యూబ్‌ ఖాతా నుంచి ఆమెను ఉద్దేశిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యను పోస్ట్‌ చేశాడు. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో నిందితుడు చెన్నయ్య గుంటూరులో ఉన్నట్లు గుర్తించారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రత్యేక బృందంతో అక్కడికి వెళ్లి చెన్నయ్యను అరెస్టు చేసి, గచ్చిబౌలిలోని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement