టాలీవుడ్‌లో విషాదం: ప్లేబ్యాక్‌ సింగర్‌ కన్నుమూత

Playback Singer AVN Murthy Passed Away - Sakshi

కరోనా ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌ వల్ల చిత్రపరిశ్రమలో ఎంతోమంది అర్ధాంతరంగా తనువు చాలించారు. దీని ధాటి నుంచి తప్పించుకునేందుకు పలుచోట్ల షూటింగ్స్‌ సైతం రద్దు చేశారు. అయినప్పటికీ వలువురు సినీప్రముఖులు, వారి ఆత్మీయ బంధువులు ఈ మహమ్మారి బారిన పడి కన్నుమూస్తున్నారు. ఇదే సమయంలో అనారోగ్యం చుట్టుముట్టడంతో మరికొందరు అసువులు బాస్తున్నారు.

తాజాగా తెలుగు, తమిళ సినిమాల్లో ఎంతో మంది ప్రముఖులకు డబ్బింగ్‌ చెప్పి, ఎన్నో పాటలు పాడిన సీనియర్‌ గాయకుడు ఏవిఎన్‌ మూర్తి మృతి చెందాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం గుండెపోటుతో చెన్నైలో తుదిశ్వాస విడిచాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన ఏవిఎన్‌ మూర్తి దాదాపు 100 సినిమాలకు పైగా పాటలు ఆలపించాడు. 40 సంవత్సరాలుగా డబ్బింగ్‌ ఆర్టిస్టుగానూ పని చేస్తున్నారు. ఏవీఎన్‌ మూర్తికి భార్య లక్ష్మీ, ఇద్దరు కుమారులు శ్రీనివాసమూర్తి, రాజేష్‌ మూర్తి ఉన్నారు. కుమారులిద్దరూ డబ్బింగ్‌ కళాకారులుగా రాణిస్తున్నారు. సినిమా పాటలతో పాటు, కొన్ని భక్తి గీతాలను కూడా ఏవీఎన్‌ మూర్తి ఆలపించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. 

చదవండి: ఆ దర్శకుడు నా స్టార్‌డమ్‌ పెంచారు: చిరంజీవి

చిత్రసీమ ఆత్మబంధువు బి.ఎ. రాజు ఇకలేరు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top