పాపం పావలా శ్యామల.. తిండిలేక, అనారోగ్యంతో..

Pavala Syamala Struggles Financial Problem - Sakshi

పావలా శ్యామల.. గుర్తుందా మీకు? అదేనండీ గోలీమార్‌ సినిమాలో తన అమాయకపు మాటలతో విలన్‌కు చిరాకు తెప్పించి తన యజమాని చావుకు కారణం అవుతుంది. ఆ సినిమానైనా మర్చిపోతారేమో కానీ.. ఈ సీన్‌ని మాత్రం మర్చిపోలేం. అంతలా ఆ సీన్‌ని పండించారు పావలా శ్యామల. అలాంటి శ్యామల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. ఒకవైపు కూతురి అనారోగ్యం, మరోవైపు ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉ‍న్నారు. 

ఖడ్గం, ఆంధ్రావాలా, బాబాయ్‌ హోటల్‌, గోలీమార్‌ వంటి సూపర్‌ చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్యామల.. ప్రస్తుతం ఓ అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యంలో బాధపడుతున్నారు. దాదాపు 250 చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నఆమె.. ఆర్థిక కారణాల వల్ల అవార్డులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఆమెకు నెలకు 10వేల రూపాయల పెన్షన్ వచ్చేలా సహాయం అందించారు. అయితే ప్రస్తుతం ఆ పెన్షన్ కూడా సరిగ్గా రావడం లేదని ఆమె ఆవేదన చెందారు. గత మూడు నెలలు ఇంటి అద్దె కూడా కట్టలేదని వాపోతున్నారు శ్యామల.

శ్యామల ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న ఆర్టిస్ట్‌ కరాటే కల్యాణి తన వంతు సాయాన్ని అందించారు. అలాగే మా అసోసియేషన్‌ ద్వారా కూడా సహాయం అందేలా ప్రయత్నం చేస్తానని అన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరు పావలా శ్యామలను ఆదుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top