Shah Rukh Khan: పఠాన్‌ సినిమాకు షారుక్‌ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా?

Pathan Movie: Shah Rukh Khan Remuneration Details - Sakshi

సుమారు ఐదేళ్ల విరామం తర్వాత పఠాన్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌. అతడిని స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా పఠాన్‌ రిలీజ్‌ కానుంది.  ఈ సినిమాలో హాలీవుడ్‌ రేంజ్‌లో యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు షారుక్‌ ఎంత పారితోషికం తీసుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

బీటౌన్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం షారుక్‌ రూ.35 - 40 కోట్ల మేర రెమ్యునరేషన్‌ అందుకున్నాడట. ఇంతేనా అనుకోకండి. షారుక్‌ పారితోషికంతో పాటు తన సినిమాకు వచ్చే లాభాల్లో కొంత వాటా కూడా తీసుకుంటాడు. అంటే రెమ్యునరేషన్‌ తక్కువే అయినప్పటికీ సినిమాకు వచ్చే లాభాలతో భారీగా ఆర్జిస్తాడన్నమాట. ఇకపోతే పఠాన్‌ మూవీ తొలిరోజు రూ.35-40 కోట్ల మేర వసూళ్లు రాబట్టే ఛాన్స్‌ ఉందని సినీపండితులు అంచనా వేస్తున్నారు. మరి షారుక్‌ తన రికార్డులను తానే తిరగరాస్తాడా? లేదా? అనేది చూడాలి!

చదవండి: పెళ్లి చేసుకున్న ప్రతినిధి హీరోయిన్‌, ఫోటోలు వైరల్‌
నన్ను అపార్థం చేసుకున్నారు, రోజూ ఏడ్చేదాన్ని: రష్మిక

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top