రికార్డులు తిరగరాసిన ఉప్పెన

Panja Vaishnavs Uppena Movie Joins Rs100 Crore Club - Sakshi

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 12వ తేదీన విడుదలైన బాక్సాపీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. లాక్‌డౌన్‌ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. మొదటి రోజే ఈ మూవీ రికార్డు స్టాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయ‌ల షేర్ రాబట్టింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం వాటిని నిజం చేస్తూ సూపర్‌ హిట్‌గా నిలిచింది. సినిమా విడుదలకు ముందే ఇది వంద కోట్ల సినిమా అవుతుందని డైరెక్టర్‌ సుకుమార్‌ జోస్యం చెప్పారు. ఇప్పుడు అక్షరాలా అదే నిజమైంది. ఉప్పెన చిత్రం  100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.

ఈ విషయాన్ని'ఉప్పెన' నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఉప్పెన వంద కోట్ల గ్రాస్‌ కొల్లగొట్టిందని పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. 'ఓ మంచి సినిమాను ఏదీ ఆపలేదని మరోసారి ఈ ఉప్పెనతో రుజువైంది. మీ ఉప్పెనంత ప్రేమకి ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాతో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇంత వరకు ఏ డెబ్యూ హీరోకి రాని వసూళ్లను రాబట్టి అప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్‌ చేశారు.  ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌ పాత్రలో నటించగా, దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. 

చదవండి : (ఆ యాడ్స్‌లో ఉన్న చిన్నారి ‘బేబమ్మే’!)
(ఉప్పెన విజయం: వైష్ణవ్‌, ‘బేబమ్మ’కు భారీ గిఫ్ట్‌)
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top