Krithi Shetty: లావణ్య త్రిపాఠి రూట్‌లో కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?

Krithi Shetty Marriage Rumors - Sakshi

ఉప్పెన సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన 'కృతి శెట్టి' తన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఉప్పెన సినిమా తర్వాత ఆమె నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా హిట్టుగా నిలవగా, బంగార్రాజు సినిమా యావరేజ్‌గా నిలిచింది. అలా ఆమెకు మొదటి మూడు సినిమాలు మాత్రమే హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో ఆమె చేసిన సినిమాలు ప్రేక్షకుల నుంచి నెగటివ్ టాక్ రావడంతో డిజాస్టర్లుగా నిలిచాయి.

టాలీవుడ్‌కు ఆమె వచ్చిన కొత్తలో  అమ్మడి అదృష్టం ఓ రేంజ్‌లో ఉండేది. ఏ సినిమా అయినా సరే 'కృతి శెట్టి' కావాలి అనేంతగా తన ఇమేజ్‌ ఉండేది.  అప్పట్లో స్టార్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ఎవరైనా సరే సినిమా ఛాన్స్‌లు ఇస్తామని ఈ చిన్నదాని వెనుక తెగ తిరిగారు. అయితే అవకాశాలను మాత్రమే అందుకుంది కానీ, విజయాలను అందుకోలేకపోయింది. ఉప్పెన బ్యూటీ అని తెచ్చుకున్న అదే పేరుతో ఇప్పటికీ కొనసాగుతోంది.

(ఇదీ చదవండి: మీ నుంచి చాలా నేర్చుకున్నా.. బన్నీపై బాద్ షా ప్రశంసలు!)

ప్రస్తుతం ఈ భామ చేతిలో ఒక సినిమా మాత్రమే ఉంది. రాబోయే రోజుల్లో అవకాశాలు వస్తాయో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. కానీ ఈ బ్యూటీ చుట్టూ అప్పుడప్పుడు పలు రూమర్స్‌ మాత్రం నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంటాయి. వాటిని ఆమె తన టీమ్‌ ద్వారా తిరిగి సమాధానం కూడా చెబుతూ వచ్చేది.

పెళ్లిపై రూమర్స్‌
తాజాగా కృతి శెట్టి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్‌మీడియాలో భారీగా ప్రచారం జరుగుతుంది. మెగా ఫ్యామిలీకి చెందిన 'వైష్ణవ్ తేజ్‌'తో ఆమె వివాహం అంటూ నెట్టింట వార్తలు జోరుగా వైరల్‌ అవుతున్నాయి. ఉప్పెన సినిమాలో  వీరిద్దరి కాంబినేషన్‌ ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా సమయంలోనే వాళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైందని పలు రకాలుగా చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే 'మిస్టర్‌' సినిమా సమయంలో మా మధ్య ప్రేమ మొదలైందని లావణ్య త్రిపాఠి, వరుణ్‌ తేజ్‌ చెప్పిన విషయం తెలిసిందే. సుమారు 7 ఏళ్లు పైగా వారి ప్రేమను దాచి.. నిశ్చితార్థంతో అందరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే. అదే మాదిరి 'కృతి శెట్టి- వైష్ణవ్ తేజ్‌'లు కూడా షాకిస్తారా..?  కాదూ, ఇవన్నీ రూమర్స్‌ మాత్రమే అని తిప్పికొడతారో వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉండగా ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం తనకు లేనట్లు పలుమార్లు బేబమ్మ చెప్పిన విషయం తెలిసిందే. తనకు ఉన్న టాలెంట్‌కు ఒక​ మంచి కథ పడితే మళ్లీ ఆమె కెరియర్‌ ఇండస్ట్రీలో దూసుకుపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ బేబమ్మకు ఒక సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ టాలీవుడ్‌లో ఉంది. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ సూపర్‌ హిట్‌ సినిమాతో ప్రారంభం అవుతుందని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. కాబట్టి ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకుని తన కెరియర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టకపోవచ్చని తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top