Ori Devuda Review: ‘ఓరి దేవుడా..!’టాక్‌ ఎలా ఉందంటే..

Ori Devuda Movie Twitter Review In Telugu - Sakshi

అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో విష్వక్‌సేన్‌ హీరోగా, వెంకటేశ్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఓరి దేవుడా..!’. ఆశాభట్, మిథిలా పాల్కర్‌ హీరోయిన్స్‌గా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా నేడు(అక్టోబర్‌ 21) విడుదలైంది. తమిళ సూపర్‌ హిట్‌ ‘ఓ మై కడవులే’చిత్రానికి ‘ఓరి దేవుడా..!’తెలుగు రీమేక్‌.  అక్కడ దేవుడి పాత్రని విజయ్‌ సేతుపతి పోషిస్తే.. తెలుగులో విక్టరీ వెంకటేశ్‌ చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. దానికి తోడు సినిమా ప్రమోషన్స్‌ని కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘ఓరిదేవుడా..!’పై హైక్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్‌ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ఓరి దేవుడా..!’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.

పెళ్లి తర్వాత కొన్నాళ్లకే అపార్థాలతో  విడిపోవాలకొని కోర్టు మెట్లు ఎక్కిన ఓ జంట జీవితాలలోకి దేవుడు వచ్చాక ఎలాంటి పరిణామాలు చేసుకున్నాయి. వారి సమస్యలను దేవుడు ఎలా పరిష్కరించాడు అనేదే ఈ సినిమా కథ. ఫస్టాఫ్‌ చాలా కామెడీగా, సెకండాఫ్‌ చాలా ఎమోషనల్‌గా సాగుతుందని చెబుతున్నారు.  థియేటర్స్‌లో ఒక్కసారి చూడొచ్చని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

విశ్వక్‌ షేన్‌ చాలా బాగా నటించాడని, ఓ మై కడవులే చూసినవారు కూడా ఈ సినిమా చూడొచ్చని చెబుతున్నారు. సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్‌ అయిందని కామెంట్‌ చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top