ఓటీటీలోకి హిట్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే రానుందా? | Ooru Peru Bhairavakona Movie OTT Latest Release Date - Sakshi
Sakshi News home page

Ooru Peru Bhairavakona OTT: సర్‌ప్రైజ్ ఓటీటీ ఎంట్రీకి 'ఊరి పేరు భైరవకోన' రెడీ!?

Published Mon, Mar 4 2024 6:39 PM | Last Updated on Mon, Mar 4 2024 6:48 PM

Ooru Peru Bhairavakona OTT Release Date Latest - Sakshi

హిట్ సినిమా అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రానుందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే రిలీజ్ ప్లాన్ మారిందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఓటీటీ ప్రేమికులకు పండగే. ఇంతకీ ఏంటా సినిమా? ఎప్పుడు వచ్చే అవకాశముంది?

(ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే)

తెలుగు సినిమాలకు ఫిబ్రవరి నెల.. డ్రై సీజన్ లాంటిది. ఎందుకంటే సంక్రాంతి సీజన్ ముగిసి కొన్నిరోజులే అయ్యింటుంది. అలానే పిల్లలకు పరీక్షల కాలం దగ్గర పడుతుంది కాబట్టి పేరెంట్స్ బయటకు వచ్చేది తక్కువే. దీంతో స్టార్ హీరోలు ఎవరూ ఫిబ్రవరిలో తమ చిత్రాల్ని ప్లాన్ చేసుకోరు. అలా మీడియం రేంజ్ చిత్రాలు వస్తుంటాయి. ఈసారి అలా వచ్చి హిట్ అయిన సినిమా 'ఊరిపేరు భైరవకోన'.

సందీప్ కిషన్, వర్ష బొల్ల‍మ్మ నటించిన ఓ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇకపోతే ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని జీ5 సంస్థ దక్కించుకుంది. నాలుగు వారాల ఒప్పందం ప్రకారం మార్చి 15 తర్వాత అలా వచ్చే అవకాశముందని అనుకున్నారు. కానీ ఈ వారం చివర్లో అంటే మార్చి 8 లేదా 9వ తేదీన సర్‌ప్రైజ్ స్ట్రీమింగ్ ఉండొచ్చని తెలుస్తోంది. అలానే ఈ వీకెండ్‌లోనే 'హనుమాన్' కూడా ఇదే ఓటీటీలో స్ట్రీమింగ్ ఉందని అంటున్నారు. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement