NTR 30: Jr NTR Movie With Koratala Siva Confirmed, Watch NTR 30 Motion Poster - Sakshi
Sakshi News home page

NTR 30 Latest Update: ఎన్టీఆర్‌- కొరటాల ప్రాజెక్ట్‌.. బిగ్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

May 19 2022 7:13 PM | Updated on May 19 2022 7:34 PM

NTR 30: Jr NTR Movie With Koratala Siva Confirmed, Watch NTR 30 Motion Poster - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ కెరీర్‌లో 30వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఎన్టీఆర్‌ చేస్తున్న సినిమా కావడంతో మరింత హైప్‌ నెలకొంది. రేపు(శుక్రవారం)ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్‌కు గిఫ్ట్‌ అందించారు మేకర్స్‌.

మోషన్‌ పోస్టర్‌తో పూనకాలు తెప్పించారు. 'అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తను ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని. వస్తున్నా'.. అంటూ ఎన్టీఆర్‌ వాయిస్‌తో పవర్‌ ఫుల్‌ వీడియోను వదిలారు. ఇందులో కత్తి పట్టుకొని ఎన్టీఆర్‌ మాస్‌ లుక్‌తో అదరగొట్టాడు. 

పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతుందని ఈ స్పెషల్‌ వీడియోను చూస్తే అర్థమవుతుంది. యుశసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా ఎవరు నటించనున్నారన్నది మాత్రం ఇంకా సస్పెన్స్‌గా కొనసాగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement