కొరటాల మూవీకి ఎన్టీఆర్‌ షరతు!, అందుకే ఈ నిర్ణయం.. | NTR 30: Jr NTR Condition To Koratala Siva For A Movie | Sakshi
Sakshi News home page

#Jr NTR 30: ఎన్టీఆర్‌, కొరటాల మూవీకి టైటిల్ ఇదేనట!

Sep 17 2021 7:46 PM | Updated on Sep 17 2021 8:11 PM

NTR 30: Jr NTR Condition To Koratala Siva For A Movie - Sakshi

Jr NTR And Koratala Shiva Movie: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తాజా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ షూటింగ్‌ పూర్తయింది. ఈ మూవీ తర్వాత తారక్‌ వరుసగా మూడు ప్రాజెక్ట్‌లకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. కొరటాల శివ, ప్రశాంత్‌ నీల్‌, త్రివిక్రమ్‌ల ప్రాజెక్ట్స్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ పూర్తి కావడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించేందుకు ఎన్టీఆర్‌ ప్లాన్‌ చేస్తుకుంటున్నాడట. ఈ క్రమంలో ముందుగా కొరటాలతో ఎన్టీఆర్‌ 30(#NTR 30) మూవీ చేయన్నాడు.

చదవండి: మూడింతల ఎక్కువ ఫన్‌తో `ఎఫ్ 3`.. మేకింగ్‌ వీడియో వైరల్‌

ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ విషయంలో ఎన్టీఆర్‌ ఓ నిర్ణయం తీసుకున్నాడట. ఈ మూవీని 6 నెలల్లోగా పూర్తి చేయాలని కొరటాలకు చెప్పినట్లు టాలీవుడ్‌లో టాక్‌. ఎందుకంటే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఎక్కువ సమయం తీసుకోవడంతో ఈ ఎడాది ఆయన సినిమాల సంఖ్య తగ్గింది. దీంతో వచ్చే ఏడాదిలో అయిన కనీస సినిమాలు చేయాలనే ఉద్దేశంతో శరవేగంగా షూటింగ్స్‌ను పూర్తి చేయాలనుకుంటున్నాడట. అంతేగాక ఇప్పటికే త్రివిక్రమ్‌, ప్రశాంత్‌ నీల్‌ ప్రాజెక్ట్‌ ప్రకటించి నెలలు గడుస్తున్నాయి.

చదవండి: సమంతే నా ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ లవర్‌.. రీట్వీట్‌ చేసిన సామ్‌

ఆ సినిమాలకు కూడా డేట్స్‌ ఇచ్చేందుకే ఎన్టీఆర్‌, కొరటాలకు ఈ షరతు పెట్టినట్లు సమాచారం. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ మూవీకి ‘డైమండ్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్‌ విద్యార్థి సంఘ నాయకుడిగా కనిపించబోతున్నాడట. ఈ చిత్రంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడకు చెందిన ప్రముఖ నటీనటులను కూడా దర్శకుడు భాగస్వామ్యం చేయనున్నాడని వినికిడి. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్ పేరు వినిపిస్తోంది. కాగా ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న కొరటాల అనంతరం ఎన్టీఆర్‌ మూవీని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement