‘పుష్ప’లో అదిరిపోయే ఐటెం సాంగ్‌, బాలీవుడ్‌ భామ షాకింగ్‌ రెమ్యూనరేషన్‌! | Nora Fatehi Demands Shocking Remuneration For Pushpa Movie Item Song | Sakshi
Sakshi News home page

Pushpa Movie: బాలీవుడ్‌ భామ షాకింగ్‌ రెమ్యూనరేషన్‌ డిమాండ్‌, అవాక్కైన మేకర్స్‌

Oct 7 2021 9:23 AM | Updated on Oct 7 2021 10:23 AM

Nora Fatehi Demands Shocking Remuneration For Pushpa Movie Item Song - Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం షరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ మూవీని రెండు పార్ట్స్‌గా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్‌, ఫస్ట్‌లుక్‌, సాంగ్‌లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో పుష్ప సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ సుక్కు అదిరిపోయే ఐటెం సాంగ్‌ను ప్లాన్‌ చేశాడట. 

చదవండి: షూటింగ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న సమంత

దీని కోసం బాలీవుడ్‌ భామ నోరా ఫేతేహిని సంప్రదించాడట సుకుమార్‌. ఈ ఆఫర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నోరా.. భారీగా డిమాండ్‌ చేసినట్లు సమాచారం.కేవలం ఒక్క అయిదు నిమిషాలక పాట కోసం ఆమె ఏకంగా 2 కోట్ల రూపాయలు డిమాండ్‌ చేశారు. ఇంత పారితోషికం మన తెలుగులోని కొందరూ యంగ్‌ హీరోలకు కూడా ఉండదు. దీంతో ఆమె డిమాండ్‌ విన్న సుక్కు, మేకర్స్‌ ఒక్కసారిగా అవాక్కాయ్యారట. ఎందుకంటే గతంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘టెంపర్’ సినిమాలో ఐటం సాంగ్ కోసం కేవలం రూ. 5 లక్షలు తీసుకున్న ఆమె.. ఇప్పుడు 2 కోట్లు అడగడంతో మేకర్స్ షాకయ్యారట. 

చదవండి: కస్టమర్లు నీచంగా ప్రవర్తిస్తారు: బాలీవుడ్‌ బ్యూటీ

అయితే ప్రస్తుతం నోరాకు వీపరితమైన క్రేజ్‌ ఉంది. బి-టౌన్‌లో ఆమె చేసిన ఐటెం సాంగ్‌లు అన్ని సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలుస్తున్నాయి. దీంతో మేకర్స్‌ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె డిమాండ్‌కు మరి మేకర్స్‌ ఒకే చేశారా? లేదా అనేది తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ మూవీ బన్ని పుష్ప రాజ్‌ అనే లారీ డ్రైవర్‌గా కనిపించపోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే మూవీ యూనిట్‌ ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement