Actress Ester Noronha Shocking Comments On Singer Noel After Divorce - Sakshi
Sakshi News home page

Ester Noronha: విడాకుల సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యా, కానీ తర్వాత..

Feb 19 2022 8:41 PM | Updated on Feb 20 2022 10:25 AM

Noel Sean Ex Wife Ester Noronha Shocking Comments On After Divorce  - Sakshi

'భీమవరం బుల్లోడు' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్‌ నోరోన్హ. ఆ తర్వాత 'గరం'లో ఓ సాంగ్‌, 'జయజయజానకి నాయక'లో ఓ చిన్న పాత్ర చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతలోనే ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. ఈ క్రమంలో సింగర్‌ నోయల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లి చేసుకున్న ఆరు నెలల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 

చదవండి: Manchu Family: ఆ పోస్టులు డిలీట్‌ చేయకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా..

విడాకుల అనంతరం అడపాదడపా చిత్రాలు చేస్తున్న ఎస్తర్‌ తాజాగా ‘69 సంస్కార్‌ కాలనీ’ మూవీలో నటించింది. మార్చి 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రానుంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఎస్తర్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై నోరు విప్పింది. అలాగే నోయల్‌తో విడాకులపై కూడా స్పందించింది. విడాకుల అనంతరం రెట్టింపు సంతోషంగా ఉన్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

‘విడాకుల సమయంలో చాలా ఒత్తిడికి లోనయ్యాను. కానీ ఎప్పుడైతే అన్నింటికీ సిద్ధపడి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నానో అప్పుడు ఫ్రీ అయ్యా. ఎందుకంటే దీనిపై నా ఫ్యామిలీకి నేను ఎలా సమాధానం చెప్పుకోవాలని భయపడ్డాను. కానీ ఎప్పుడైతే వారికి తెలిసిందో నా తల్లిదండ్రులు కూడా నాకు అండగా నిలబడ్డారు. దీంతో నాకు రెట్టింపు ధైర్యం, ఎనర్జీ వచ్చింది’ అని చెప్పుకొచ్చింది ఎస్తర్‌. 

చదవండి: పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ టాలీవుడ్‌ రైటర్‌

ఇక ‘ఎక్కడో బయటి వ్యక్తులు విడాకులు తీసుకున్నారనే వార్తలు వినడమే కానీ ఆ అనుభవం ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు నేను ఆ పరిస్థితికి వస్తానని ఊహించుకోలేదు. మా కుటుంబంలో కూడా ఇలాంటివి లేవు. అలాంటి పరిస్థితుల్లో విడాకుల నిర్ణయంతో సతమతమయ్యాను. కానీ ఎప్పుడైతే విడాకుల పోస్ట్‌ షేర్‌ చేశానో కంటిన్యూస్‌గా నా ఫోన్‌ రింగ్‌ అయ్యింది. అందులో కొందరూ ఈమె కూడా జీవితం చెడగొడ్డుకుంది నాలాగే అంటూ సంతోషించారు.. మరికొందరెమో నీకు మేమున్నామంటూ ధైర్యమిచ్చారు’ అని చెప్పింది ఎస్తర్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement