Ester Noronha: 'ఛాన్సుల కోసం హీరోయిన్స్ అలా చేస్తారు.. స్క్రీన్ షాట్స్ చూశా'

Noel Ex Wife Ester Noronha: 'భీమవరం బుల్లోడు' సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్ నోరోన్హ. ఆ తర్వాత వెయ్యి అబద్ధాలు, జయ జానకి నాయిక, గరం వంటి చిత్రాల్లో కనిపించినా పెద్దగా అవకాశాలు రాలేదు. కొన్నాళ్లకు సింగర్ నోయల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆరు నెలల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
విడాకుల అనంతరం అడపాదడపా చిత్రాలు చేస్తున్న ఎస్తర్ తాజాగా ‘69 సంస్కార్ కాలనీ’ మూవీలో నటించింది. ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ఎస్తర్ కాస్టింగ్ కౌచ్‌పై ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. 'ఇండస్ట్రీలో అన్ ప్రొఫెషనల్ ట్రాక్స్ చాలా చూశాను. సినిమా ఆఫర్లతో పాటు ఈ ఆఫర్లు కూడా వచ్చేవి.. వాళ్లని ఇంప్రెస్ చేయమని వీళ్లని ఇంప్రెస్ చేయమని అనేవాళ్లు.
ఆఫర్ కోసం ఏం చేయడానికైనా రెడీ అని చెప్పిన హీరోయిన్లు కూడా ఉన్నారు. ఆ సోకాల్డ్ హీరోయిన్స్ చాట్స్ స్క్రీన్ షాట్స్ కూడా నేను చూశాను. కెరీర్ కోసం ఏదైనా చేస్తాం అంటారు. అలా ఆడవాళ్లే స్వయంగా ఆఫర్స్ ఇవ్వడం అనేది కూడా ఇండస్ట్రీలో ఉంది. క్యాస్టింగ్ కౌచ్ నేను కూడా ఎదుర్కొన్నాను. కానీ ఆఫర్స్ కోసం అలాంటి నీచమైన పనులు చేయను' అని చెప్పుకొచ్చింది.