‘అంతా కొత్త ప్రపంచం.. భయంగా ఉంది’ స్టార్‌ హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ | Nivetha Thomas Interesting Post On Social Media | Sakshi
Sakshi News home page

Nivetha Thomas: ‘అంతా కొత్త ప్రపంచం.. భయంగా ఉంది’ స్టార్‌ హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Oct 10 2026 4:38 PM | Updated on Oct 10 2026 5:05 PM

Nivetha Thomas Interesting Post On Social Media

హీరోయిన్‌ నివేదా థామస్‌ విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ సమయంలోనే వరుస అవకాశాలు అందుకుని మంచి నటిగా పేరు సంపాదించారు. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. 2024లో విడుదలైన ‘35 చిన్న కథ కాదు’ చిత్రంతో మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో ప్రశంసలతో పాటు పలు అవార్డులను అందుకున్నారు. 

కొంత విరామం తర్వాత ఇప్పుడు ‘శ్రీమతి’ అనే ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. త్వరలోనే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కొత్త సినిమా ప్రయాణం గురించి నివేదా థామస్‌ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

‘కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నా’
‘అంతా సిద్ధమైంది! ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాను. అది అంతా నాకు తెలిసినప్పటికీ ఇది ఎంతో అవసరమైనది.  ఓ గొప్ప ప్రత్యేకతను కలిగి ఉంది. కొత్త సినిమా సెట్‌లో మొదటి రోజు దగ్గరపడుతుండటంతో నాలో ఓ రకమైన ఆందోళనగా భయంగా ఉంది. ఇది ఆత్రుత కాదు.. పని మొదలుపెట్టాలనే ఉత్సాహం. ఓ అమ్మాయి సినిమా చిత్రీకరణ కోసం బయలుదేరింది’ అని నివేదా థామస్‌ రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘35 చిన్న కథ కాదు’ తర్వాత నివేదా ఎలాంటి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తారన్న ఆసక్తి నెలకొంది. ‘శ్రీమతి’ చిత్రంతో ఆమె మరోసారి తన నటనతో మెప్పిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? కథలో నివేదా పాత్ర ఎలా ఉండబోతోంది? అనే విషయాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి నాని ‘ది ప్యారడైజ్‌’.. ​కొత్త మార్పులతో స్ట్రీమింగ్‌..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement