ప్రముఖ నటి నివేదా పేతురాజ్‌కు చేదు అనుభవం!

Nivetha Pethuraj Found A Cockroach In Her Ordered Food - Sakshi

ప్రముఖ దక్షిణాది సినీ నటి నివేదా పేతురాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం సాయంత్రం తను ఆర్డర్‌ చేసిన ఫుడ్‌లో చచ్చిన బొద్దిక వచ్చందంటూ సదరు రెస్టారెంట్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆహరంలో ఉన్న బొద్దింక ఫొటో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఆ రెస్టారెంట్‌ పేరు వెల్లడించింది. ప్రస్తుతం ఆమె పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం సాయంత్రం నివేదా చెన్నైలోని ఓ ఫేమస్‌ రెస్టారెంట్‌ నుంచి ప్రముఖ ఫుడ్‌డెలివరి యాప్‌ స్విగ్గీ నుంచి ఆర్డర్‌ చేసుకుంది. ఆర్డర్‌ రాగానే పార్శిల్‌ తెరిచి చూడగా అందులో చచ్చిన బొద్దింక దర్శనం ఇచ్చింది.

దీంతో ఆమె మండిపడుతూ తన పోస్టులో ‘ప్రస్తుత రోజుల్లో స్విగ్గీ ఇండియా, ఆయా రెస్టారెంట్స్‌ ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నాయో అర్థం కావడం లేదు. నిన్న నేను ఆర్డర్‌ పెట్టుకున్న ఆహారంలో బొద్దింక వచ్చింది. ఇదేం తొలిసారి కాదు గతంలో కూడా ఇలాగే జరిగింది. ఇలాంటి రెస్టాంటెంట్స్‌ను రోజు తనిఖీ చేసి క్వాలిటీ లోపం ఉంటే భారీగా జరిమాన విధించడం చాలా అవసరం. ప్రస్తుతానికి అయితే ఈ రెస్టారెంట్‌పై ఓ కన్నేసి అది సరైన ప్రమాణాలను పాటిస్తుందో లేదో చెక్‌ చేయాలని కోరుకుంటున్న’ అంటూ ఆమె సదరు రెస్టారెంట్‌ పేరును ట్యాగ్‌ చేసిందే అంతేగాక తమ రెస్టారెంట్ల జాబితా నుంచి ఈ రెస్టారెంట్‌న తొలగించాల్సిందిగా స్విగ్గీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసింది.

చదవండి: 
‘బంగార్రాజు’తో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ రీఎంట్రీ !

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top