Nithya Menen Gives Clarity On Her Marriage Rumours, Deets Inside - Sakshi
Sakshi News home page

Nithya Menen Marriage Rumours: పెళ్లి వార్తలపై స్పందించిన నిత్యా మీనన్‌

Jul 20 2022 4:56 PM | Updated on Jul 20 2022 5:46 PM

Nithya Menen Denies Her Wedding Rumours - Sakshi

తన పెళ్లి వార్తలపై నిత్యా మీనన్‌ స్పందించింది. తాజాగా ఓ మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో తన పెళ్లంటూ వస్తున్న వార్తలపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనిపై నిత్యా స్పందిస్తూ.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘నిన్నటి నుంచి నా పెళ్లి అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. అసలు అందులో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి పుకార్లు ఎలా సృష్టిస్తారో అర్థం కావడం లేదని’ స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెట్టానని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని పేర్కొంది. 

చదవండి: ఆయన కోసమే నగ్నంగా నటించా.. హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

కాగా నిత్యా మీనన్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని, మాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌తో ఆమె ఏడడుగులు వేయబోతుందంటూ నిన్నటి నుంచి పలు మలయాళ వెబ్‌సైట్స్‌, యూట్యూబ్‌ చానల్లో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం నిత్యా మీనన్‌ వెబ్‌ సిరీస్‌, సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఇటీవల భీమ్లా నాయక్‌తో అలరించిన ఆమె తాజాగా మోడ్రన్ లవ్ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైంలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

వీటితో పాటు తాజాగా ఆమె నటించి మలయాళ చిత్రం 19(1)(a) డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలకు రెడీ అవుతోంది. త్వరలోనే దీని రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. తమిళంలో హీరో ధనుష్‌తో నటించిన ‘చిరు చిత్రంబళం’ త్వరలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఆమె మరో చిత్రం ‘ఆరం తిరుకల్పన’ ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement