వైరలవుతున్న నిహారిక పాండిచ్చేరి వెకేషన్‌ ఫోటోలు

Niharika Konidela Enjoying Vacation WithHusband Chaitanya In Pondicherry - Sakshi

నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి తర్వాత మరింత యాక్టివ్‌గా కనిపిస్తోంది. భర్త జొన్నలగడ్డ చైతన్యతో కలిసి టూర్‌లు చుట్టోస్తూ.. మ్యారేజ్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. అత్తారింట్లో అడుగుపెట్టిన అనంతరం మెగా డాటర్‌ డ్రెస్సింగ్‌ స్టైల్‌ కూడా మారిపోయింది. నిత్యం ట్రెండీ లుక్‌లోనే దర్శనమిస్తుంది. ఎక్కడికెళ్లినా తమ జంట దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది. తాజాగా చైతన్య- నిహారిక జంట వెకేషన్ ట్రిప్‌లో భాగంగా పాండిచ్చేరి అందాలను ఆస్వాదిస్తున్నారు.

ఈ క్రమంలో అక్కడ హోటల్‌ రూమ్‌లో దిగిన ఓ హాట్‌ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఫోటోకు పెట్టిన కామెంట్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అద్దంలో తనను తానే చూసుకుంటున్న ఈ ఫోటోపై 'పార్ధు ఇంకోసారి చూసి చెప్పు' అంటూ అతడు సినిమాలో త్రిష చెప్పిన డైలాగ్‌ను గుర్తుచేస్తూ కామెంట్‌గా పెట్టింది. అయితే ఇక్కడే ఓ షరతు పెట్టింది ఈ బ్యూటీ. ఈ డైలాగ్‌ ఏ సినిమాలో ఉందో గుర్తురాని వాళ్ళు దయచేసి కామెంట్ చేయొద్దు అని ఆమె పేర్కొంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. పెళ్లి తర్వాత నిహారిక గ్లామర్ డోస్ పెంచిదని కొందరు, అయినా ఏం బాలేదని మరికొందరు బదులిస్తున్నారు. కాగా ప్రస్తుతం నిహారిక పాండిచ్చేరిలో దిగిన ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top