Nia Sharma: I am Still a Beggar Who Needs Work, Money - Sakshi
Sakshi News home page

Nia Sharma: అంతా అయిపోయింది.. మనీ కోసం, ఛాన్స్‌ కోసం అడుక్కుంటున్నా

Jun 23 2022 7:54 PM | Updated on Jun 24 2022 7:25 AM

Nia Sharma: I am Still a Beggar Who Needs Work, Money - Sakshi

స్వచ్ఛందంగా బ్రేక్‌ తీసుకునేంత సీన్‌ మాకు లేదు. నేను ఆ స్థాయిలో లేను. ఇప్పటికీ అవకాశాల కోసం, డబ్బులు సంపాదించడం కోసం అడుక్కుంటూనే ఉన్నాను. నాకు పని కావాలి. అలా అని ఏది పడితే అది చేయలేను. మంచి రోల్‌ అనిపిస్తేనే చేస్తాను...

గతేడాది బిగ్‌బాస్‌ షోలో అలరించింది నియా శర్మ. తర్వాత జమై 2 అనే వెబ్‌ సిరీస్‌ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కానీ ఆ తర్వాత ఏ సీరియల్‌లోనూ, వెబ్‌ సిరీస్‌లోనూ కనిపించనేలేదు. దీంతో నియా బ్రేక్‌ తీసుకుందని అనుకున్నారంతా. కానీ తాను బ్రేక్‌ తీసుకోలేదని, అదే వచ్చిందని అంటోంది బుల్లితెర నటి నియా శర్మ.

స్వచ్ఛందంగా బ్రేక్‌ తీసుకునేంత సీన్‌ మాకు లేదు. నేను ఆ స్థాయిలో లేను. ఇప్పటికీ అవకాశాల కోసం, డబ్బులు సంపాదించడం కోసం అడుక్కుంటూనే ఉన్నాను. నాకు పని కావాలి. అలా అని ఏది పడితే అది చేయలేను. మంచి రోల్‌ అనిపిస్తేనే చేస్తాను. అందుకోసం నెలలు, సంవత్సరాల తరబడి ఎదురుచూస్తాను. దురదృష్టవశాత్తూ కొన్నిసార్లు ఇదంత మంచిది కాదు. ఎందుకంటే ఈ నిరీక్షణ మనల్ని బాధిస్తుంది. శూన్యంలోకి నెట్టేస్తుంది. ఆడిషన్‌ చేసి చాలాకాలమే అయింది. అంతా ఆగిపోయింది. కానీ నాకంటూ ఓ రోజు వస్తుంది. ఆరోజు ఏదైనా పెద్ద అవకాశమే వరిస్తుంది. అప్పుడు తప్పకుండా దాన్ని స్వీకరిస్తాను అని చెప్పుకొచ్చింది.

చదవండి: విక్రాంత్‌ రోణ ట్రైలర్‌ చూశారా?
 బ్రేకుల్లేకుండా దూసుకుపోతున్న బేబమ్మ, అప్పుడే మరో ఛాన్స్‌ కొట్టేసిందిగా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement