స్టార్ హీరోయిన్‌తో అసభ్య ప్రవర్తన.. బోనీ కపూర్‌పై నెటిజన్స్‌ ఫైర్! | Netizens Slams Boney Kapoor Of Touching Priyamani Inappropriately | Sakshi
Sakshi News home page

Boney Kapoor: మీకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు?.. బోనీ తీరుపై నెటిజన్స్‌ ఆగ్రహం!

Published Wed, Apr 10 2024 7:51 PM | Last Updated on Wed, Apr 10 2024 8:58 PM

Netizens Slams Boney Kapoor Of Touching Priyamani Inappropriately - Sakshi

అజయ్ దేవగణ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం మైదాన్. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అమిత్ శర్మ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. భారత ఫుట్‌బాల్‌ కోచ్‌ అబ్దుల్‌ సయ్యద్‌ రహీం జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. 

అయితే తాజాగా ఈ సినిమా చూసేందుకు మైదాన్ నిర్మాతల్లో ఒకరైన బోనీ కపూర్‌ థియేటర్‌కు వచ్చారు. అదే సమయంలో హీరోయిన్ ప్రియమణితో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అయితే బోనీ కపూర్ వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ప్రియమణి నడుముపై చేతులు వేస్తూ కనిపించారు. అంతే కాకుండా ఎలా పడితే అలా తాకుతూ ప్రియమణిని ఇబ్బందికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో నెటిజన్స్‌ ఫైరవుతున్నారు. 68 ఏళ్ల వయసులో ఉన్న ప్రముఖ నిర్మాత అసభ్యకరంగా వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నారు. 

ఓ నెటిజన్ రాస్తూ.. "ప్రియమణి లాంటి అందరికీ బాగా తెలిసిన హీరోయిన్‌తో అసహ్యంగా ప్రవర్తించడం బాగాలేదు. ఇక రాబోయే నటీమణులతో బోనీ ఎలా ప్రవర్తిస్తాడో నేను ఊహించలేకపోతున్నా"అంటూ రాసుకొచ్చారు. మరొక నెటిజన్ కామెంట్ చేస్తూ..' మీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని గుర్తుంచుకోండి. ఇలా ప్రవర్తించడం చాలా అవమానకరంగా ఉంది' అని పోస్ట్ చేశారు. బోనీ కపూర్ జీ మీరేమైనా ఇండియాలో హార్వే వైన్‌స్టెయిన్ అనుకుంటున్నారా? లేదా ఆ బహుమతిని తీసుకున్న వారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. 

కాగా.. బోనీ కపూర్ మహిళలతో ఇలా అనుచితంగా ప్రవర్తించడం మొదటిసారి కాదని నెటిజన్లు అంటున్నారు. 2023లో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)ని ప్రారంభోత్సవం సందర్భంగా చిత్రనిర్మాత జిగి హడిద్ బేర్ నడుముపై చేతులు వేసి ఫోటోలకు పోజులిచ్చారు. అప్పుడు కూడా నెటిజన్లు విమర్శలు చేశారు. అంతే కాదు ఓ కార్యక్రమంలో ఊర్వశి రౌతేలాతోనూ అలాగే ప్రవర్తించారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement