నా ఆటోబయోగ్రఫీ ఇచ్చాను.. ఆయన భయపడ్డారు: సీనియర్‌ నటి

Neena Gupta Gives Her Autobiography To Gulzar Says About His Reaction - Sakshi

ముంబై: సినీ గేయ రచయిత గుల్జార్‌ను కలిసి తన జీవతచరిత్రను అందజేసినట్లు సీనియర్‌ నటి నీనా గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ముఖంపై నవ్వుతో పాటు, కాస్తంత భయాన్ని కూడా చూశానని సరదాగా వ్యాఖ్యానించారు. నీనా గుప్తా జీవితం సంచలనాలకు కేంద్ర బిందువు అన్న సంగతి తెలిసిందే. విండీస్‌ మాజీ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌తో సహజీవనం ఆమె.. పెళ్లికాకముందే ఆయన బిడ్డకు జన్మనిచ్చారు. పాపకు మసాబాగా నామకరణం చేసి ఒంటరిగానే ఆమె బాధ్యతలు స్వీకరించి, తనను పెంచి పెద్ద చేసి.. డిజైనర్‌గా స్థిరపడేలా ప్రోత్సాహం అందించారు. ఈ క్రమంలో నీనా పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు కూడా.

ఇక బాలీవుడ్‌లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నీనా గుప్తా.. ఇటీవలే తన ఆటోబయోగ్రఫీ ‘సచ్‌ కహూ తో’ను విడుదల చేశారు. తన జీవితంలోని ముఖ్య విషయాలన్నింటినీ ఇందులో లిఖించుకున్న ఆమె.. తన ప్రియమైన వ్యక్తులకు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలోని గుల్జార్‌ నివాసంలో ఆయనను కలిసిన నీనా గుప్తా.. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో గేటు బయటే గుల్జార్‌ను కలిసిన ఆమె.. ‘‘ చదివి ఎలా ఉందో చెప్పండి.. నిజం చెప్పాలంటే ఆయన సంతోషించారు.. అలాగే భయపడ్డారు కూడా’’ అంటూ సరదా క్యాప్షన్‌ జతచేశారు.

అందుకే నాపై ఆయన అరిచారు..
తన ఆటోబయోగ్రఫీలో ఎన్నెన్నో విషయాలు వెల్లడించిన నీనా గుప్తా.. దర్శకుడు సుభాష్‌ ఘాయ్‌పై ప్రశంసలు కురిపించారు. ఖల్‌నాయక్‌ సినిమాలో చోళీ కే పీచే క్యా హై పాట కోసం.. నిండుగా కనిపించాలంటూ అరిచిన విధానాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘‘నా అవుట్‌ఫిట్‌ చూసి ఆయన పెద్దగా అరిచారు. పాట అర్థానికి తగ్గట్టుగా వక్షస్థలం నిండుగా కనిపించేలా చూసుకోమని సూచించారు. ఆ మాట వినగానే నాకు ఏదోలా అనిపించింది. కానీ ఆలోచిస్తే నిజమే కదా.. అనిపించింది. మరుసటి రోజు.. లోదుస్తులతో ఆ ఖాళీని పూడ్చి షూట్‌కు వెళ్లాను. చిన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకుంటారు. ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వరు. అందుకే గొప్ప డైరెక్టర్‌ గుర్తింపు పొందారు’’ అని రాసుకొచ్చారు.

చదవండి: సౌత్‌ నిర్మాత రాత్రంతా గదిలో ఉండమన్నాడు : నటి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top