వి ఇంటికి వస్తోంది | Nani-Sudheer Babu starrer V to release on Amazon Prime | Sakshi
Sakshi News home page

వి ఇంటికి వస్తోంది

Aug 21 2020 2:16 AM | Updated on Aug 21 2020 2:16 AM

Nani-Sudheer Babu starrer V to release on Amazon Prime - Sakshi

‘‘పన్నెండేళ్లుగా నా కోసం మీరు థియేటర్‌కు వచ్చారు. ఇప్పుడు నేను మీ కోసం, మీకు ధన్యవాదాలు చెప్పేందుకు మీ ఇంటికే వస్తున్నాను. మీ స్పందన తెలుసుకోవాలనే ఉత్సుకతతో పాటు.. ‘వి’ సినిమా రిలీజ్‌ విషయంలో కొంచెం నెర్వస్‌గానూ అనిపిస్తోంది’’అంటూ హీరో నాని సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.

సుధీర్‌బాబు, నాని, నివేదా థామస్, అదితీ రావ్‌ హైదరి ముఖ్య పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వి’. ‘దిల్‌’రాజు, శిరీష్, లక్ష్మణ్, హర్షిత్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా థియేటర్లో విడుదలవుతుందా? ఓటీటీలోనా? అనే సందిగ్ధం చాలా రోజులుగా ఉండేది. అయితే ‘వి’ సినిమా సెప్టెంబరు 5న ఓటీటీలోనే (అమెజాన్‌ ప్రైమ్‌) విడుదల కానున్నట్లు నాని స్పష్టం చేశారు. తన సోషల్‌ మీడియాలో నాని ఓ లేఖను షేర్‌ చేశారు.. దాని సారాంశం ఇలా...

‘‘నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన 25వ చిత్రం డిజిటల్‌ ఫార్మెట్‌లో విడుదలవుతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇలా డిజిటల్‌ ఫార్మెట్‌లో విడుదల కావడం నాకు గొప్ప మధురానుభూతిగా మిగిలిపోయేలా సెలబ్రేట్‌ చేసుకుందాం (అభిమానులను ఉద్దేశించి). థియేటర్లు తెరుచుకోగానే ‘టక్‌ జగదీశ్‌’ సినిమాతో సిద్ధంగా ఉంటా.. ఒట్టు’’ అని నాని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement