9 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా | Sakshi
Sakshi News home page

OTT Movie: ఒకే పాత్రతో తీసిన డిఫరెంట్ మూవీ.. ఏ ఓటీటీలో ఉందంటే?

Published Sun, Jan 28 2024 2:09 PM

Nanditha Swetha Raa Raa Penimiti Movie OTT Streaming Details - Sakshi

మరో డిఫరెంట్ తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కేవలం ఒకే ఒక పాత్రతో తీసిన ఈ చిత్రం గతేడాది థియేటర్లలో రిలీజ్ అయింది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఇన్నాళ్లకు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. అయితే సమ్‌థింగ్ స్పెషల్ ఉండే మూవీస్ చూద్దామనుకునేవాళ్లు ఇది ట్రై చేయొచ్చు.ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: కుర్చీ తాత అరెస్ట్.. అసలు నిజాలు బయటపెట్టిన యూట్యూబర్)

హీరోయిన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నందిత శ్వేతా.. తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. ఈమెని ప్రధాన పాత్రలో పెట్టి తీసిన విభిన్న సినిమా 'రా రా పెనిమిటి'. సత్య వెంకట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ.. మ్యూజిక్ అందించారు. గతేడాది ఏప్రిల్ 28న థియేటర్లలోకి వచ్చింది. ఆ తర్వాత ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.

ఇప్పుడు సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత 'హంగామా ప్లే', 'గ్యాలక్సీ ఓటీటీ' అనే రెండు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లోకి ఈ సినిమా వచ్చేసింది.  అమెజాన్ ప్రైమ్‌లోనూ ఉన్నప్పటికీ.. మనం దేశంలో మాత్రం స్ట్రీమింగ్ అందుబాటులో లేదు. కథ విషయానికొస్తే టైటిల్‌కి తగ్గట్లు.. ఓ భార్య తన భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మరి చివరకు ఏమైంది? భర్త వచ్చాడా లేదా అనేది స్టోరీ. పలువురు ఆర్టిస్టుల వాయిస్ వినిపిస్తుంది. కానీ మూవీ మొత్తం నందితా శ్వేతా మాత్రమే కనిపిస్తుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?)

Advertisement
 
Advertisement
 
Advertisement