‘పాప’సెంటిమెంట్‌తో బాక్సాఫీస్‌ షేక్‌ చేస్తున్న నందమూరి హీరోలు

Nandamuri Heroes Balakrishna, Jr NTR, Kalyan Ram Follows Child Sentiment - Sakshi

అప్పుడప్పుడు సినిమా పరిశ్రమలో కొన్ని సెంటిమెంట్లు అనేవి భలేగా వర్కౌట్ అవుతాయి. కావాలని ఫాలో అయినవి కాకపోయినా వాటి వల్ల వచ్చే ఫలితాలు మాత్రం చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. ఇటీవలి కాలంలో నందమూరి హీరోలకు ‘పాప’ ఫ్యాక్టర్ అనేది ఆయా చిత్రాలు బ్లాక్ బస్టర్ కావడానికి ఉపయోగపడిందనేది వాస్తవం. గత ఏడాది డిసెంబర్ నెలలో రిలీజైన బ్లాక్ బస్టర్ అఖండ సినిమాలో  బాలకృష్ణ కూతురిగా నటించిన పాప చుట్టే దర్శకుడు బోయపాటి శ్రీను సెకండ్ హాఫ్ మొత్తం కూడా నడిపించాడు.అలాగే సీక్వెల్ కి లింక్ కూడా అక్కడే ఇచ్చాడు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ చేసిన కొమురం భీమ్ క్యారెక్టర్‌ పోరాడేది చిన్నపాపైన మల్లి కోసమే.ఈ తాలూకు ఎమోషన్ రామ్ చరణ్ కన్నా ఎక్కువగా కనెక్ట్ అయ్యింది తారక్ క్యారెక్టర్ తోనే.తాజాగా రిలీజైన బింబిసార సినిమాలో చెడ్డవాడైన చక్రవర్తి తన చేతిలో మరణించిన పాప కోసం ప్రాయశ్చిత్తంగా వర్తమానంలో తన ప్రాణాలు కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. ఇది దర్శకుడు వశిష్ట ప్రెజెంట్ చేసిన థీమ్ లో బలమైన పాయింట్ ఇదే.

(చదవండి: సీతారామం సక్సెస్‌.. ఆరోజు ఏడ్చేశా..: దుల్కర్‌ సల్మాన్‌)

అఖండ, ఆర్ఆర్ఆర్, బింబిసార చిత్రాలలో  చైల్డ్ సెంటిమెంట్ ఇంత బ్రహ్మాండంగా వర్కౌట్ అవ్వడం స్పెషల్‌ అనే చెప్పాలి.ఇంకా అది కూడా కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో ఈ మూడు హిట్ కావడం గమనార్హం. నందమూరి ఫ్యాన్స్ ఆనందం అయితే మాములుగా లేదు. ముఖ్యంగా ఎప్పటి నుంచో సక్సెస్ లేక వెయిట్ చేస్తున్న కళ్యాణ్ రామ్ కు ఈ రేంజ్ సక్సెస్ దక్కడం పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు. బింబిసార 2 సినిమా కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఆ చిట్టితల్లిని కంటిన్యూ చేస్తారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top