
Nagarjuna respond on CM Jagan-Chiranjeevi meet: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చిరంజీవి భేటీపై సీనియర్ హీరో నాగార్జున స్పందించారు. సినిమా పరిశ్రమ తరపున మాట్లాడడానికే సీఎం జగన్‌తో చిరంజీవీ సమావేశం అయ్యారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల గురించి తాను, చిరంజీవి చర్చించుకున్నామని, సీఎంతో భేటీకి నన్ను కూడా ఆహ్వానించారని, కానీ బంగార్రాజు ప్రమోషన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్ ఉండటంతో నాకు కుదరలేదని నాగార్జున పేర్కొన్నారు. సీఎం జగన్‌తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. అంతా మంచే జరుగుతుందని నాగార్జున చెప్పుకొచ్చారు.
కాగా, తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. గురువారం ఉదయం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు వెళ్లిన చిరంజీవి.. అక్కడి నుంచి కారులో నేరుగా సీఎం క్యాంప్ క్యార్యాలయానికి వెళ్లారు. సీఎంతో భేటీ అనంతరం.. చిరంజీవి మీడియాతో మాట్లాడనున్నారు.