Nagababu Comments About Varun Tej Marriage, Details Inside - Sakshi
Sakshi News home page

Varun Tej: త్వరలోనే వరుణ్‌ తేజ్‌ పెళ్లి.. భార్యతో కలిసి వేరు కాపురం!

Jan 31 2023 1:35 PM | Updated on Jan 31 2023 1:55 PM

Nagababu Comments About On Varun Tej Marriage - Sakshi

టాలీవుడ్‌లో ఈ మధ్య చాలా మంది హీరోలు పెళ్లి చేసుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో నితిన్‌, రానా, నిఖిల్‌ లాంటి యంగ్‌ హీరోలంతా ఓ ఇంటివాళ్లయ్యారు. ఇక మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ లిస్ట్‌లో ఉన్న శర్వానంద్‌ కూడా త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇటీవల శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అందరి దృష్టి మెగా హీరోలు సాయితేజ్‌, వరుణ్‌ తేజ్‌లపై పడింది. 

ముఖ్యంగా వరుణ్‌ పెళ్లి కోసం అయితే మెగా ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శుభవార్తను చెప్పాడు మెగా బ్రదర్‌ నాగబాబు. త్వరలోనే వరుణ్‌ తేజ్‌ పెళ్లి ఉంటుందని, ఈ విషయాన్ని వరుణ్‌ అధికారికంగా ప్రకటిస్తాడని ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు చెప్పుకొచ్చాడు. అయితే అమ్మాయి ఎవరనే విషయం మాత్రం ఆయన వెల్లడించలేదు. పెళ్లి కూతురుకు సంబంధించిన వివరాలను ఇప్పుడే చెప్పలేనని, ఆ విషయాలన్ని వరుణ్‌ తేజ్‌ వెల్లడిస్తాడని నాగబాబు అన్నారు. అంతేకాదు పెళ్లి తర్వాత వరుణ్‌ తన భార్యతో కలిసి వేరే ఇంట్లో ఉంటాడని, తాను తన భార్యతో కలిసి మరో ఇంట్లో ఉంటామని చెప్పారు.

 ఓ యంగ్‌ హీరోయిన్‌తో వరుణ్‌ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఆమెని పెళ్లి చేసుకోబోతున్నాడని ఆ మధ్య పుకార్లు వచ్చాయి. అలాగే ఓ వ్యాపారవేత్త కూతురిని వరుణ్‌ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఈ పుకార్లపై నాగబాబు స్పందించలేదు. వరుణ్‌ ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.  నాగబాబు సమర్పణలో ఎస్‌వీసీసీ పతాకంపై బాపినీడు, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement