Hero Naga Shaurya's Krishna Vrinda Vihari Movie Release Date Out, Deets Here - Sakshi
Sakshi News home page

Krishna Vrinda Vihari Movie: నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' వచ్చేది అప్పుడే..

Mar 7 2022 3:27 PM | Updated on Mar 7 2022 4:15 PM

Naga Shaurya Krishna Vrinda Vihari Movie Release Date Out - Sakshi

Naga Shaurya Krishna Vrinda Vihari Movie Release Date Out: యంగ్ హీరో నాగశౌర్య వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవలే వరుడు కావలెను, లక్ష్య, అశ్వథ్థామ వంటి విభిన్న చిత్రాలలో హీరోగా మెప్పించాడు. తాజాగా నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. అనీష్‌ ఆర్‌. కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ సింగర్‌ షిర్లే సెటియా హీరోయిన్‌గా చేస్తోంది. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించగా శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పిస్తున్నారు.

శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్‌. 'కృష్ణ వ్రింద విహారి ఏప్రిల్‌ 22న వస్తున్నాడు' అంటూ ట్విటర్‌ వేదికగా పోస్టర్‌ షేర్‌ చేశారు. ఈ సినిమా కుటుంబంతో చూడదగిన పూర్తి వినోదాత్మక చిత్రమని టాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. నాగశౌర్య భిన్నంగా, సరికొత్త రోల్ చేస్తున్నట్లు వెల్లడించాయి. ఒక సాంగ్‌ తప్ప మిగతా షూటింగ్‌ సుమారు పూర్తయిందని సమాచారం. ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక కీలకపాత్ర పోషిస‍్తున్నారు. వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరుల నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్‌ సంగీతమందిస్తున్నారు. సాయి శ్రీరామ్‌ ఛాయాగ్రహణం బాధ్యతలు స‍్వీకరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement