ఊపిరి నువ్వే ఊరికి.. | Naga Shaurya Rangabali first lyrical song out | Sakshi
Sakshi News home page

ఊపిరి నువ్వే ఊరికి..

May 25 2023 1:06 AM | Updated on May 25 2023 6:50 AM

Naga Shaurya Rangabali first lyrical song out - Sakshi

‘‘తూరుపు పడమర ఏ దిక్కు పడవుర.. నువ్వే మాకు దిక్కు రా...’, ‘గోపురం గుడికి రా... అక్షరం బడికి రా.. ఊపిరి నువ్వే ఊరికి రా’’ అంటూ సాగే పాట ‘రంగబలి’ చిత్రం నుంచి విడుదలైంది. నాగశౌర్య హీరోగా పవన్‌ బాసంశెట్టి దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో యుక్తి తరేజ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది.

విలేజ్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా జూలై 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘తూరుపు పడమర..’ లిరికల్‌ వీడియోను బుధవారం విడుదల చేశారు. సంగీత దర్శకుడు సీహెచ్‌ పవన్‌ స్వరపరచిన ఈ పాటకు పవన్‌ బాసంశెట్టి, శ్రీ హర్ష సాహిత్యం అందించగా అనురాగ్‌ కులకర్ణి పాడారు. జానీ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. ఈ చిత్రానికి కెమెరా: దివాకర్‌ మణి.

Advertisement
 
Advertisement
Advertisement