Naga Chaitanya: మళ్లీ ప్రేమించేందుకు సిద్ధంగా ఉన్నారా? చై ఏమన్నాడంటే..

Naga Chaitanya Questioned Finding Love Again In Laal Singh Chaddha Promotion - Sakshi

నాగచైతన్య ప్రస్తుతం ‘లాల్‌ సింగ్‌ చద్దా’ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంతో చై బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్‌ 11న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌ కార్యక్రమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఇక హిందీలో చైకి తొలి చిత్రం కావడంతో బాలీవుడ్‌ మీడియాకు వరుస పెట్టి ఇంటర్య్వూ ఇస్తున్నాడు. ఈ క్రమంలో చైకి తన వ్యక్తిగత జీవితం, సమంత విడాకులు వంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటన్నింటికి చైతన్య తనదైన స్టైల్లో సమాధానం ఇస్తున్నాడు.

చదవండి: సమంతపై ఇప్పటికి గౌరవం ఉంది.. కానీ!: నాగ చైతన్య

దీంతో చై కామెంట్స్‌ ఆసక్తిని సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంతో తాజాగా ముంబై మీడియాతో ముచ్చటించిన చైకి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు మళ్లీ మీరు ప్రేమను కనుగొన్నారా? ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉన్నారా? అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దీనిపై చై స్పందిస్తూ.. ఏమో! ఎవరికి తెలుసు. ఏదైనా జరగొచ్చు అంటూ సమాధానం ఇచ్చాడు. అనంతరం ‘ప్రేమ అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రేమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనం జీవించడానికి గాలి కీలక పాత్ర పోషిస్తుందో.. మన జీవితంలో ప్రేమ కూడా అంతే ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనం ప్రేమించాలి. ప్రేమను స్వీకరించాలి. అప్పుడే మన జీవితం ఆరోగ్యవంతంగా.. సానూకూలంగా సాగుతుంది’ అని చెప్పుకొచ్చాడు. 

చదవండి: బాక్సాఫీస్‌పై ‘బింబిసారుడి’ దాడి.. తొలి రోజు ఎంతంటే..

కాగా నటి శోభితా దూళిపాళతో చై ప్రేమలో పడ్డాడంటూ ఇటీవల పుకార్లు వచ్చిన నేపథ్యంలో తాజాగా ప్రేమపై చై చేసిన కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ప్రస్తుతం నాగ చైతన్య చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆమిర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన లాల్‌ సింగ్‌ చద్దాలో నాగ చైతన్య బాలరాజున అనే ఆర్మీ యువకుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా చై పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుందని, ప్రతి ఒక్కరిన ఆకట్టుకుంటుందని ఇప్పటికే మూవీ యూనిట్‌ పలు సందర్భాల్లో పేర్కొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top