Naga Chaitanya And Krithi Shetty Custody Movie Press Meet At Chennai, Deets Inside - Sakshi
Sakshi News home page

నాగచైతన్యతో నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్‌: కృతిశెట్టి

May 6 2023 8:55 AM | Updated on May 6 2023 9:33 AM

Naga Chaitanya Krithi Shetty Custody Press Meet At Chennai - Sakshi

నాగచైతన్య, కృతిశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం కస్టడీ. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా పొట్లూరి నిర్మించిన ఈ ద్విభాషా (తమిళం, తెలుగు) చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా కలిసి సంగీతాన్ని అందించిన ఇందులో అరవింద్‌స్వామి, శరత్‌కుమార్‌, ప్రియమణి ముఖ్యపాత్రలు పోషించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 12న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ శుక్రవారం సాయంత్రం చైన్నెలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

దర్శకుడు వెంకట్‌ ప్రభు మాట్లాడుతూ కస్టడీ చిత్రం బాగా వచ్చిందని చెప్పారు. ఇది యూనిక్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని చేయడం మంచి అనుభవం అన్నారు. కృతిశెట్టి మాట్లాడుతూ ఇది తాను నటించిన రెండవ తమిళ చిత్రం అని, అదేవిధంగా నాగచైతన్యతో నటించిన రెండవ చిత్రం కూడా ఇదని చెప్పారు. ఆయనతో నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్‌ అని, ఆ కంఫర్ట్‌ ఉందని పేర్కొన్నారు. 

నాగచైతన్య మాట్లాడుతూ ఈ మూమెంట్‌ గుర్తుండిపోతుందన్నారు. వెంకట్‌ ప్రభు కథ చెప్పి వినగానే చాలా ఎగ్జైట్‌ అయ్యానని, చిత్రం పూర్తి అయిన తరువాత కూడా అంతే అనుభూతి కలిగిందన్నారు. యాక్షన్‌ సన్నివేశాలను బాగా తీశారన్నారు. ఇది సీరియస్‌ నేపథ్యంలో సాగే కథా చిత్రం అయినా దర్శకుడు వెంకట్‌ ప్రభు కామెడీ టచ్‌ మిస్‌ కాదన్నారు. ఇందులో బ్లాక్‌ బస్టర్‌ అంశం సంగీత దర్శకుడు ఇళయరాజా అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement